Begin typing your search above and press return to search.

మాస్ మ‌హారాజా ఊర మాస్ లుక్ అదుర్స్‌

By:  Tupaki Desk   |   14 Jan 2022 6:09 AM GMT
మాస్ మ‌హారాజా ఊర మాస్ లుక్ అదుర్స్‌
X
మాస్ మ‌హారాజా ర‌వితేజ మునుపెన్న‌డూ లేని విధంగా సినిమాల ప‌రంగా స్పీడు పెంచేశారు. గ‌త కొంత కాలంగా స‌రైన హిట్ మూవీ కోసం ఎదురు చూసిన ఆయ‌న‌కు తాజాగా `క్రాక్ ` సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ల‌భించింది. గోపీచంద్ మ‌లినేని తెర‌కెక్కించిన ఈ చిత్రం గ‌త ఏడాది విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించ‌డ‌మే కాకుండా ర‌వితేజ కెరీర్ లో భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీ ఇచ్చిన స‌క్సెస్ తో రెట్టించిన ఉత్సాహంతో వున్న మాస్ మ‌హారాజా ర‌వితేజ వ‌రుస చిత్రాల‌ని లైన్ లో పెట్టారు.

శుక్ర‌వారం భోగి సంద‌ర్భంగా ర‌వితేజ న‌టిస్తున్న ఊర మాస్ మ‌సాలా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `రావ‌ణాసుర‌` లాంఛ‌నంగా మొద‌లైంది. సుధీర్ వ‌ర్మ డైరెక్ట్ చేస్తున్నారు. అభిషేక్ పిక్చ‌ర్స్‌, ఆర్ టి టీమ్ బ్యాన‌ర్ ల‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీ ప్రారంభోత్స‌వానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ర‌వితేజ‌తో పాటు హీరోయిన్ ల‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ నిచ్చారు. అంత‌కు ముందు ర‌వితేజ మాస్ లుక్ కి సంబంధించిన న్యూ పోస్ట‌ర్ ని విడుద‌ల చేశారు.

ఊర మాస్ గెట‌ప్ లో సిగ‌ర్ ని లైట‌ర్ తో వెలిగిస్తూ మాసిన గ‌డ్డంతో క‌నిపిస్తున్న ర‌వితేజ మాసీవ్ లుక్ ఆక‌ట్టుకుంటోంది. ప‌వ‌ర్‌ఫుల్ మాస్ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో ర‌వితేజ లాయ‌ర్ గా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. మాస్‌రాజాకు ధీటైన పాత్ర‌లో యంగ్ హీరో సుశాంత్ క‌నిపించ‌బోతున్నారు. అంతే కాకుండా ఇందులో మాస్ రాజాతో ముగ్గుకు క్రేజీ భామ‌లు ఫ‌రియా అబ్దుల్లా, అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్ న‌టిస్తున్నారు.

కీల‌క‌మైన లేడీ విల‌న్ గా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో `జాంబిరెడ్డి` ఫేమ్ ద‌క్షా నాగ‌ర్ క‌ర్ క‌నిపించ‌బోతోంది. స‌రికొత్త నేప‌థ్యంలో ర‌వితేజ న‌ట‌విశ్వ‌రూపం చూపించ‌నున్నీ ఈ మూవీని సెప్టెంబ‌ర్ 30న విడుద‌ల చేయ‌నున్నామ‌ని నిర్మాత ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు. తాజా పోస్ట‌ర్‌లో ర‌వ‌తేజ డ్రెస్ పై ర‌క్త‌పు మ‌ర‌క‌లు చూస్తుంటే ఆయ‌న పాత్ర కొంత నెగ‌టివ్ ట‌చ్ తో సాగుతుంద‌ని తెలుస్తోంది. అంతే కాకుండా రావ‌ణాసుడు అంటే ప‌దిత‌ల‌ల వాడు కాబ‌ట్టి సినిమాలో ర‌వితేజ కూడా ప‌ది ర‌కాల గెట‌ప్ ల‌లో క‌నిపించి సర్‌ప్రైజ్ చేయ‌నున్నాడ‌ట‌.

తాజా పోస్ట‌ర్ తో భారీ అంచ‌నాల‌తో పాటు చాలా క్వ‌శ్చ‌న్స్ ని రైజ్ చేసిన `రావ‌ణాసుర‌` ఏ స్థాయిలో ఆక‌ట్టుకుంటుందో తెలియాలంటే సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు వేచి చూడాల్సిందే. ఇదిలా వుంటే మాస్ మ‌హారాజా ఊర మాస్ లుక్ చూసిన వారంతా లుక్ అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.