Begin typing your search above and press return to search.

ద‌స‌రా పోస్ట‌ర్: సంక్రాంతికి క్రాక్ ఫుల్ గా ఎక్కిస్తాడ‌ట‌

By:  Tupaki Desk   |   25 Oct 2020 7:15 AM GMT
ద‌స‌రా పోస్ట‌ర్: సంక్రాంతికి క్రాక్ ఫుల్ గా ఎక్కిస్తాడ‌ట‌
X
మాస్ మ‌హారాజా ర‌వితేజ లేటెస్ట్ లుక్ చూస్తుంటే షాక్ తిన‌కుండా ఉండ‌లేం. ఇంత‌కుముందు ఆయ‌న లుక్ పై ర‌క‌ర‌కాల విమ‌ర్శ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో ఎవ‌రూ ఊహించ‌నంత ఛేంజ్ చూపిస్తున్నారు. విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా ఆయ‌న న‌టిస్తున్న లేటెస్ట్ సినిమాల పోస్ట‌ర్లు హీట్ పెంచేస్తున్నాయి. ఇప్ప‌టికే ర‌వితేజ ఖిలాడీ లుక్ అభిమానుల్లోకి వైర‌ల్ గా దూసుకెళ్లింది.

తాజాగా క్రాక్ లుక్ రిలీజైంది. విజ‌య‌ద‌శ‌మి శుభాకాంక్ష‌ల‌తో ఈ పోస్ట‌ర్ ని రివీల్ చేయ‌గా 2021 సంక్రాంతికి క్రాక్ మూవీ రిలీజ‌వుతోంద‌ని అధికారికంగా టీమ్ ప్ర‌క‌టించింది. ఇక ఈ మూవీ షూటింగ్ ని శ‌ర‌వేగంగా పూర్తిచేస్తున్న సంగ‌తి తెలిసిన‌దే. మార్చి నుంచి కోవిడ్ -19 లాక్ ‌డౌన్ కారణంగా హీరో రవితేజ పూర్తిగా స్వీయ‌నిర్భంధంలోనే ఉండిపోయారు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వ‌హిస్తున్న ఈ మూవీలో రవితేజ పోలీస్ పాత్ర స‌ర్ ప్రైజ్ చేయ‌నున్నారు. అత‌డి స‌ర‌స‌న శ్రుతిహాస‌న్ హాట్ కిల్లింగ్ లేడీగా హ‌ల్ చ‌ల్ చేయ‌నుంది.

ఈసారి డిఫ‌రెంటుగా ర‌వితేజ‌- శ్రుతి రొమాన్స్ కి సంబంధించిన లుక్ ని టీమ్ రిలీజ్ చేసింది. మాస్ రాజా అభిమానుల‌కు ద‌స‌రా ట్రీట్ అదిరింది. గోల్డ్ ఎల్లో షైనింగ్ డిజైన‌ర్ కోట్లు ధ‌రించిన జంట కిల్లింగ్ లుక్ తో దుమారం రేపుతోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అభిమానుల్లో వైర‌ల్ గా మారింది. చాలా సంవత్సరాల క్రితం విజయవాడలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. తమన్ సంగీత‌ స్వరకర్త. ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు.