Begin typing your search above and press return to search.

రవితేజ భలే టైటిల్‌ పట్టేశాడే

By:  Tupaki Desk   |   11 Aug 2020 9:30 AM GMT
రవితేజ భలే టైటిల్‌ పట్టేశాడే
X
మాస్‌ మహారాజా ‘క్రాక్‌’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా తర్వాత రమేష్‌ వర్మ దర్శకత్వంలో రవితేజ సినిమాకు కమిట్‌ అయ్యాడు. ఆ సినిమా షూటింగ్‌ ఈ ఏడాది చివర్లో ప్రారంభం అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి అయ్యింది. రీతూ వర్మ మరియు ఐశ్వర్య రాజేష్‌ లు ఈ చిత్రంలో హీరోయిన్స్‌ గా నటించబోతున్నట్లుగా టాక్‌ వినిపిస్తుంది. ఈ విషయమై ఇంకా ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు.

ఈ సినిమాకు ‘కిలాడీ’ అనే టైటిల్‌ ను దర్శకుడు రమేష్‌ వర్మ రిజిస్ట్రర్‌ చేయించాడట. ఇలాంటి టైటిల్స్‌ రవితేజకు బాగా సూట్‌ అవుతాయి. గతంలో ఇలాంటి టైటిల్స్‌ తో వచ్చిన రవితేజ మరోసారి ఖచ్చితంగా సక్సెస్‌ అవుతాడనే నమ్మకాన్ని ఫ్యాన్స్‌ వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో కిలాడీ టైటిల్‌ కు మంచి రెస్పాన్స్‌ దక్కింది. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. షూటింగ్‌ మొదలు పెట్టడానికి ముందే ఫస్ట్‌ లుక్‌ మరియు టైటిల్‌ ను రివీల్‌ చేసే అవకాశం ఉందంటున్నారు.

రవితేజ రమేష్‌ వర్మల కాంబినేషన్‌ లో గతంలో వచ్చిన సినిమా నిరాశ పర్చింది. రాక్షసుడు సినిమాతో పాజిటివ్‌ టాక్‌ దక్కించుకున్న రమేష్‌ వర్మ ఈసారి రవితేజకు కమర్షియల్‌ సక్సెస్‌ ను ఇవ్వాలని గట్టి ప్రయత్నం చేయబోతున్నాడు. మరి ఈసారి అయినా వీరి కాంబోలో సక్సెస్‌ అయ్యేనా అనేది ఆసక్తికరంగా మారింది. రవితేజకు కిలాడీ టైటిల్‌ కలిసి వస్తుందనే నమ్మకంను యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.