Begin typing your search above and press return to search.

షారూక్ ను చెన్నైను త‌ల‌చుకున్న మార్వ‌ల్ స్టార్

By:  Tupaki Desk   |   14 Jun 2021 12:30 AM GMT
షారూక్ ను చెన్నైను త‌ల‌చుకున్న మార్వ‌ల్ స్టార్
X
మార్వ‌ల్ సినిమాటిక్ యూనివ‌ర్శ్(ఎంసీయు)లో అవెంజ‌ర్స్ .. థోర్.. వంటి భారీ చిత్రాలు సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఎంసీయులో `లోకి` పాత్రధారి టామ్ హిడిల్ ట‌న్ ని భార‌తీయ అభిమానులు ఏమాత్రం మ‌ర్చిపోలేరు. అంత గొప్ప ప్ర‌భావం చూపిన న‌టుడు అత‌డు. దుష్ట పాత్ర అయినా అత‌డిలో మాన‌వ‌తా కోణం గురించి ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో లోకీని భార‌తీయ సినీప‌రిశ్ర‌మ గురించి ప్ర‌శ్నిస్తే.. అత‌డు ఏమాత్రం ఆలోచించ‌కుండా SRK అని చెప్పాడు. స్వీయ‌నిర్మిత స్టార్ షారూక్ పై అత‌డు అభిమానాన్ని ఎంత‌మాత్రం దాచుకోలేదు. త‌న‌కు ఇష్ట‌మైన న‌గ‌రం చెన్నై అని కూడా అన్నారు. తన అక్క చెన్నైలో ఉంటార‌ని తాను ఆ న‌గ‌రానికి ఇంత‌కుముందు విచ్చేశాన‌ని లోకి తెలిపారు.

షారూక్ కి లోకి రూపంలో మరో ముఖ్యమైన అభిమాని లభించినట్లు కనిపిస్తోంది. మార్వెల్ స్టూడియోస్ `లోకీ` స్టార్ టామ్ హిడిల్ స్టన్ తన తాజా వీడియోలో డిస్నీ + హాట్ స్టార్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ పోస్ట్ లో షారూఖ్‌ ని ప్రశంసించారు. వీడియోలో వర్డ్ అసోసియేషన్ ఆటను హిడిల్ స్టన్ ఆడుతున్నాడు. భారతదేశంపై తన మొదటి ఆలోచన గురించి అడిగినప్పుడు `షారుఖ్ ఖాన్` అని అన్నారు. కొన్ని ప్రశ్నల తరువాత అతడు మళ్ళీ బాలీవుడ్ అనే పదం ఉప‌యోగించారు. ఏదైనా భారతీయ నగరం గురించి తన మొదటి ఆలోచనలను అడిగినప్పుడు అతను చెన్నై అంటూ సమాధానం ఇచ్చాడు.

షారూఖ్ ఖాన్ తన వీడియోను రీట్వీట్ చేసి.. మీరు దయార్ధ్ర హృద‌యులు.. గాడ్ ఆఫ్ మిస్చీఫ్… ల‌వ్ యు టామ్ లోకీ.. అంటూ షారూక్ సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గుర‌య్యారు. టామ్ హిడిల్‌స్టన్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ సిరీస్ `లోకీ` లో నటిస్తున్నాడు. దీనిలో అతను మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MC U) నుండి గాడ్ ఆఫ్ మిస్చీఫ్ తన పేరుతో ఉన్న పాత్ర‌లోకి తిరిగి ప్ర‌వేవించాడు. లోకీ తన దుష్ట ప్రణాళికల పాత్ర‌కు ప్ర‌సిద్ధి. ఛ‌రిష్మా ఉన్న స్టార్ అన్న సంగ‌తి తెలిసిన‌దే.

టామ్ హిడిల్‌స్టన్ లోకిగా ఆరు MCU సినిమాల్లో నటించారు - థోర్- ది అవెంజ‌ర్స్-థోర్: ది డార్క్ వరల్డ్-థోర్: రాగ్నరోక్”-ఎవెంజర్స్: ఇన్ఫినిటీ వార్‌- అవెంజ‌ర్స్ ఎండ్‌గేమ్ చిత్రాల్లో లోకి పాత్ర క‌నిపిస్తుంది. లోకి సిరీస్ లో అత‌డి పాత్ర ఫిక్ష‌న‌ల్. టైమ్ మెఛీన్ త‌ర‌హా కాన్సెప్టుతో ఈ సిరీస్ ర‌న్ అవుతుంది. లోకి సిరీస్ కి కేట్ హెరాన్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్వెల్ స్టూడియోస్ చీఫ్ కెవిన్ ఫీజ్ నిర్మిస్తున్నారు.
ఈ సిరీస్ లో అలవాటుపడిన దానికంటే భిన్నమైన లోకీని చూడవచ్చు.