Begin typing your search above and press return to search.

ఆహా లోకి వచ్చిన 'మంచి రోజులు వచ్చాయి'..!

By:  Tupaki Desk   |   3 Dec 2021 10:38 AM GMT
ఆహా లోకి వచ్చిన మంచి రోజులు వచ్చాయి..!
X
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి సినిమా అన‌గానే న‌వ్వులు గ్యారెంటీ అని ప్రేక్షకులకు భ‌రోసా ఉంటుంది. కామెడీ విష‌యంలో ఆయ‌న‌కంటూ ఓ బ్రాండ్ కక్రియేట్ చేసుకున్నారు. ఓవైపు స్టార్ హీరోలతో సినిమాలు తీసి న‌వ్విస్తూనే.. వీలు చిక్కిన‌ప్పుడల్లా చిన్న చిత్రాలు కూడా చేస్తుంటారు. అలా కరోనా పాండమిక్ పరిస్థితుల్లో దొరికిన సమయంలో మారుతి డైరెక్ట్ చేసిన సినిమా ''మంచి రోజులు వచ్చాయి''.

యువ హీరో సంతోష్ శోభన్ - గ్లామర్ డాల్ మెహ్రీన్ కౌర్ జంటగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ మరియు మాస్ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. దీపావళి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఓ వర్గం ఆడియన్స్ ని అలరించింది. మారుతి గత చిత్రాల తరహాలోనే ఇందులో వినోదంతో పాటుగా సందేశాన్ని అందించే ప్రయత్నం చేశారు.

'మంచి రోజులు వచ్చాయి' సినిమాలో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త సంద‌ర్భాన్ని, కొత్త పాత్ర‌ల్ని తెర‌పైకి తీసుకొచ్చి ప్రేక్ష‌కుల్ని న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు. అంతేకాదు ఇందులో తండ్రీ కూతురు మధ్య ప్రేమానుబంధాన్ని చూపించారు. భ‌యం గురించి సందేశాత్మక ఆలోచ‌న రేకెత్తించేలా.. చాలా మంది నిజ జీవితాల‌కి అద్దం ప‌ట్టేలా మారుతి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ వేదిక మీదకు వచ్చేసింది.

ప్రతి శుక్రవారం బ్లాక్ బస్టర్ చిత్రాలతో 100 శాతం తెలుగు కంటెంట్ ని ప్రేక్షకులకు అందిస్తున్న 'ఆహా' ఓటీటీలో.. ఈరోజు (డిసెంబర్ 3) ''మంచి రోజులు వచ్చాయి'' సినిమాని స్ట్రీమింగ్ పెట్టారు. 'ఏక్ మినీ కథ' సినిమా మరియు 'ది బేకర్ & ది బ్యూటీ' వెబ్ సిరీస్ తో సంతోష్ శోభన్.. '3 రోజెస్' సిరీస్ తో మారుతి ఆల్రెడీ ఓటీటీలో సత్తా చాటారు. ఇప్పుడు 'మంచి రోజులు వచ్చాయి' తో మరోసారి ఆకట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ చూడవలసిన తండ్రీ కూతుర్ల కథ అంటూ ప్రమోషన్స్ చేస్తున్న ఈ సినిమాకి ఓటీటీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది.

''మంచి రోజులు వచ్చాయి'' చిత్రంలో అజయ్ ఘోష్ - వెన్నెల కిషోర్ - సప్తగిరి - సుదర్శన్ - వైవా హర్ష - సత్యం రాజేష్ - శ్రీకాంత్ అయ్యంగార్ - రంజిత తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చగా.. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు. వి సెల్యులాయిడ్ - SKN లు ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించారు.