Begin typing your search above and press return to search.

మాచర్ల దర్శకుడి వివాదం విషయంలో జాగ్రత్త పడుతున్నారా..?

By:  Tupaki Desk   |   10 Aug 2022 8:30 AM GMT
మాచర్ల దర్శకుడి వివాదం విషయంలో జాగ్రత్త పడుతున్నారా..?
X
'జయం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన యూత్ స్టార్ నితిన్.. కెరీర్ ప్రారంభంలోనే మంచి విజయాలు అందుకున్నారు. అయితే కథల ఎంపికలో పొరపాట్లు చేయడంతో వరుస పరాజయాలు పలకరించాయి. ఈ క్రమంలో డజను ప్లాప్స్ అందుకున్న యువ హీరో.. 'ఇష్క్' చిత్రంతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. అప్పటి నుంచి స్క్రిప్ట్ సెలక్షన్ లో వైవిధ్యం చూపిస్తూ.. బ్యాక్ టూ బ్యాక్స్ హిట్స్ సాధిస్తున్నారు.

అయితే 'అ ఆ' తరువాత మూడు ప్లాప్స్ అందుకున్న నితిన్.. 'భీష్మ' సక్సెస్ తర్వాత 'చెక్' 'రంగ్ దే' చిత్రాలతో నిరాశ పరిచాడు. గతేడాది ద్వితీయార్థంలో వచ్చిన 'మ్యాస్ట్రో' మూవీ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ.. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కావడంతో బాక్సాఫీస్ లెక్కలకు అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు ''మాచర్ల నియోజకవర్గం'' అనే మాస్ మసాలా ఎంటర్టైనర్ తో వస్తున్నారు.

ప్రముఖ ఎడిటర్ ఎస్ ఆర్ శేఖర్ 'మాచర్ల నియోజకవర్గం' సినిమాతో ఎమ్.ఎస్. రాజశేఖర్ రెడ్డి అనే పేరుతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి మరియు సోదరి నికితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ శుక్రవారం (ఆగస్ట్ 12) ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది.

మాచర్ల నుంచి విడుదల చేయబడిన ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కామెడీ - యాక్షన్ - రొమాన్స్.. ఇలా అన్ని కమర్షియల్ అంశాలతో కూడిన మాస్ మూవీతో రాబోతున్నట్లు హింట్ ఇచ్చాయి. ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని దూకుడుగా ప్రమోషన్స్ చేసిన నితిన్.. ఓ విషయంలో మాత్రం తెగ టెన్షన్ పడుతున్నారని టాక్ నడుస్తోంది.

దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి గతంలో చేసిన ట్వీట్లు ఇటీవల పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. కమ్మ - కాపు కులాలను దూషిస్తూ ట్వీట్లు పెట్టినట్లు కొన్ని స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలానే వైఎస్సార్సీపీ కి సపోర్ట్ గా.. టీడీపీ కి వ్యతిరేకంగా కామెంట్స్ చేసినట్లు ట్వీట్లు ఉన్నాయి.

ఇవి ఫేక్ ట్వీట్సా లేదా ఒరిజినలా అని ఆలోచించేలోపే మాచర్ల దర్శకుడిని లక్ష్యంగా చేసుకుని ఆయా వర్గాలవారు విపరీతంగా ట్రోల్ చేశారు. 'మాచర్ల నియోజకవర్గం' సినిమాని బాయ్‌ కాట్ చేయాలని.. మాచర్ల ముచ్చట్ల పేరుతో ట్విట్టర్ క్యాంపైన్ చేశారు.

అయితే దర్శకుడు వాటిని ఖండించారు. అవన్నీ ఫేక్ పోస్టులు అని.. ఎవరూ నమ్మవద్దని కోరాడు. ఎవరో కావాలని ఎడిట్ చేసి తనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పాడు. అతనికి నితిన్ సైతం మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో ఎస్ ఆర్ శేఖర్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసారు.

తన పేరు మీద నకిలీ ట్వీట్లు సృష్టించి.. కులాలు వర్గాల మధ్య ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని.. తక్షణమే నిందితులపై చర్యలు తీసుకోవాలని రాజశేఖర్ రెడ్డి పోలీసులను కోరారు. ఇది జరిగి కూడా రెండు వారాలు కావొస్తుంది. కేసు ఏమైంది? ఆ వ్యవహారం ఎంత వరకు వచ్చింది? అనేది ఎవరికీ తెలియదు.

ఇప్పుడు అందరూ ఆ వివాదంపై సైలెంట్ గా ఉన్నప్పటికీ.. మాచర్ల నియోజవర్గం సినిమాపై ఏమైనా ప్రభావం చూపిస్తుందేమో అని హీరో నితిన్ అండ్ టీమ్ ఆలోచిస్తున్నట్లు సోషల్ మీడియా టాక్. అందుకే ప్రమోషన్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.

సాధారణంగా ఏ సినిమా విడుదలైనా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రింట్ - ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడుతూ ఉంటారు. ప్రెస్ ను పిలిచి సినిమాకు సంబంధించిన విశేషాలు చెప్పడం.. మీడియా మిత్రులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం జరుగుతుంటుంది.

అయితే 'మాచర్ల' ప్రెస్ మీట్ కు కొందరికి మాత్రమే ఆహ్వానించారట. అందరినీ పిలిస్తే ఎస్ఆర్ శేఖర్ వివాదం గురించి ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో.. ఎందుకొచ్చిన గడవని ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

కాగా, 'మాచర్ల నియోజవర్గం' సినిమాలో నితిన్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. కృతి శెట్టి - కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటించగా.. అంజలి స్పెషల్ సాంగ్ లో ఆడిపాడింది. మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందించారు.