Begin typing your search above and press return to search.

ఒక్క యాక్సిడెంటులో అన్ని ట్విస్టులా?

By:  Tupaki Desk   |   13 Nov 2019 10:51 AM GMT
ఒక్క యాక్సిడెంటులో అన్ని ట్విస్టులా?
X
ఒక‌టే ప్ర‌మాదం.. కానీ ట్విస్టులెన్నో. అస‌లు పోలీసులు చెప్పేదానికి .. అక్క‌డ జ‌రిగిన దానికి .. ఆ ప్ర‌మాదానికి కార‌ణ‌మైన వారు చెబుతున్న‌దానికి ఎక్క‌డా పొంత‌న క‌నిపించ‌డం లేదు. మంగ‌ళ‌వారం రాత్రి 1.30 ప్రాంతంలో హైద‌రాబాద్ ఔట‌ర్ రింగ్ రోడ్ అప్పా జంక్ష‌న్ వ‌ద్ద హీరో రాజ‌శేఖ‌ర్ కార్ పెను ప్ర‌మాదానికి గుర‌వ్వ‌డం.. అదృష్ఠ‌వ‌శాత్తూ ఆయ‌న ఈ ప్ర‌మాదం నుంచి స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ‌డం ఇదంతా ఒక మిరాకిల్ లా భావిస్తున్నారంతా. కార్ సీట్ బెల్ట్ పెట్టుకోవ‌డం.. ఎయిర్ బ్యాగ్స్ స‌కాలంలో ఓపెన్ అవ్వ‌డం వ‌ల్ల‌నే ఆయ‌న బ‌తికి బ‌ట్ట‌క‌ట్ట‌గ‌లిగారు. ప్ర‌స్తుతం ఈ ప్ర‌మాదంపై వాస్త‌వాలేమిటి అన్న కోణంలో పోలీసుల ద‌ర్యాప్తు సాగుతోంది. రాజ‌శేఖ‌ర్ పై కేసు న‌మోదు చేసి విచార‌ణ చేస్తున్నారు.

ప్ర‌మాద స‌మ‌యంలో రాజ‌శేఖ‌ర్ కార్ 150కి.మీల వేగంతో వెళుతోంద‌ని.. అతి వేగంతో పాటు మ‌ద్యం సేవించ‌డం వ‌ల్ల‌నే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని ఇప్ప‌టికే టీవీ చానెళ్ల‌లో ప‌లు క‌థనాలు వేడెక్కించాయి. ఆయ‌న కార్ లో మ‌ద్యం సీసాలు ల‌భించాయ‌న్న ప్ర‌చారంతో అస‌లు కార‌ణం ఇదా? అంటూ వాడి వేడిగా చ‌ర్చ సాగింది. దీంతో పాటు .. రాజ‌శేఖ‌ర్ కార్ పై అతి వేగానికి సంబంధించి మూడు చ‌లానాలు క‌ట్టాల్సి ఉండ‌గా పెండింగులోనే ఉన్నాయ‌న్న వార్తా వేడెక్కించింది.

తాజాగా ఈ ప్ర‌మాదంపై శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్స్ప్‌క్టర్ వెంకటేష్ అందించిన వివరాలు షాక్ నిస్తున్నాయి. అర్ధరాత్రి 12.49 గంటలకు పెద్ద అంబర్ పేట్ ఔట‌ర్ పైకి రాజశేఖర్ కారు ఎక్కింది. 1.20గంటలకు ప్రమాదం జరిగిన‌ట్టు తెలియ‌డంతో పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకున్నారు. అయితే అప్ప‌టికే రాజ‌శేఖ‌ర్ వేరే కార్ లో అక్క‌డి నుంచి వెళ్లిపోయార‌ట‌. ఇది కేవ‌లం నిర్ల‌క్ష్యంగా అతివేగంతో డ్రైవ్ చేయ‌డం వ‌ల్ల జ‌రిగిన ప్ర‌మాదం మాత్ర‌మే. అస‌లు మ‌ద్యం సేవించార‌న‌డానికి ఆధారాల్లేవ్ అంటూ పోలీసులు కొట్టి పారేస్తున్నారు. అంతేకాదు ఆయ‌న కార్ లో ఎలాంటి మ‌ద్యం సీసాలు ల‌భ్యం కాలేద‌ని క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఇప్ప‌టికి సెక్షన్ ఐపీసీ 279 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇందులో మ‌రో ట్విస్టేమిటంటే.. ఆ ఘ‌ట‌న ప‌రిశోధ‌న ప్రారంభించాక రాజ‌శేఖ‌ర్ మ‌ధ్యం సేవించారా లేదా? అన్న‌దానిపై ప‌రీక్ష‌లు నిర్వ‌హించారా? అంటే పోలీసుల నుంచి స‌రైన జ‌వాబు రాక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.