డీప్ లిప్ లాక్ తో చెలరేగిన తాప్సీ!

Thu Aug 09 2018 11:42:01 GMT+0530 (IST)

పంజాబీ పిల్ల పంజాబీ వేషాలు వేయక గుజరాతీ వేషాలేస్తుందా? పంజాబ్ - దిల్లీ ఒణికేలా డీప్ లిప్ లాక్ లతో చెలరేగిపోయింది తాప్సీ. ఈ దెబ్బకు మరోసారి ఉత్తరాది బాక్సాఫీస్ షేకైపోవడం ఖాయమే అనిపిస్తోంది. మరీ అంత డీప్ లిప్ లాకా? ఇది నిజమా.. అని సందేహిస్తున్నారా?.. ఒకవేళ సందేహం ఉంటే మీరే ఈ ట్రైలర్ లో చూడొచ్చు.అసలింతకీ  `పింక్` - `జుడ్వా  2` తర్వాత మళ్లీ తాప్సీ హిట్ కొడుతోందా? అంటే కొట్టేసేట్టే కనిపిస్తోంది. ఈ ట్రైలర్ చూశాక ఆ సందేహం రాక మానదు. తాప్సీ నటించిన మన్మార్జియాన్ ట్రైలర్ కేక పుట్టించిందంటే నమ్మండి. ఈ ట్రైలర్ లో ముక్కోణపు ప్రేమకథ మతి చెడగొట్టింది. యువతరం గుండెల్ని తాకేంత ఎమోషన్ ఉంది. ముఖ్యంగా విక్కీ కౌశల్ తో తాప్సీ వేసిన లిప్ లాక్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. కథ డిమాండ్ చేసింది కాబట్టే ఈ లిప్ లాక్ అని సరిపెట్టుకుంటే ట్రైలర్ ఆద్యంతం ముగ్గురు ప్రేమికుల మధ్య ఎమోషన్ పీక్స్.

అసలే ఇద్దరు కుర్రాళ్లు తన వెంట పడుతున్నారు. ఆ రింగుల జుత్తులో.. ఆ డొప్ప ముక్కులో .. చిలిపి కళ్లలో ఇంకేదో నచ్చేసింది కాబట్టి ప్రేమకోసం తెగ కొట్టుకుపోతున్నారు. పంజాబి గెటప్పుల్లో అభిషేక్ బచ్చన్ - కౌశల్ అద్భుతంగా ఒదిగిపోయారు. ఇన్నాళ్టికి అభిషేక్‌కి తగ్గ పాత్ర పడిందని అర్థమవుతోంది. ఎంతో ఎంతో విషయం దాగి ఉంది కాబట్టే అలా ట్రైలర్ ఆకట్టుకుంది. మరి సినిమా ఏ రేంజులో ఆడుతుందో చూడాలి. మన్మార్జియాన్ సెప్టెంబర్ 14న రిలీజవుతోంది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో ఆనంద్ .ఎల్.రాయ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.