టీజర్ ట్రీట్: సాహో వెంటే మన్మధుడు

Tue Jun 11 2019 18:40:16 GMT+0530 (IST)

Manmadhudu 2 Movie Teaser Release Date Locked

ఒకే రోజు రెండు టీజర్లు అభిమానులకు అదిరిపోయే ట్రీటివ్వబోతున్నాయి. ఇందులో ఒకటి ప్రభాస్ ఫ్యాన్స్ కోసం .. ఇంకొకటి కింగ్ నాగార్జున ఫ్యాన్స్ కోసం రెడీ అవుతున్నాయి. ఇప్పటికే టీజర్లతో ప్రచారంలో వేడి పెంచుతున్నామని అధికారికంగా ఇరు టీమ్ లు ప్రకటించిన సంగతి తెలిసిందే.



ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ `సాహో` టీజర్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఎగ్జయిటింగ్ వేచి చూస్తున్నారు. సుజీత్ ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ యాక్షన్ చిత్రంగా తీర్చిదిద్దుతున్నారు. శ్రద్ధా కపూర్ సహా పలువురు బాలీవుడ్ స్టార్లు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఆగస్ట్ 15 రిలీజ్ తేదీని అధికారికంగా ఖాయం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ లో అంతకంతకు ఎగ్జయిట్ మెంట్ పెరుగుతోంది. ఇలాంటి టైమ్ లో యువి క్రియేషన్స్ సంస్థ ఈ గురువారం (13 జూన్) టీజర్ ట్రీట్ ఉంటుందని ప్రామిస్ చేసింది. దీంతో ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

ఈలోగానే కింగ్ నాగార్జున బరిలోకి వచ్చారు. నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మన్మధుడు 2 టీజర్ ని లాంచ్ చేస్తున్నామని టీమ్ అధికారికంగా ప్రకటించింది. నాగార్జున - అమల జంట పెళ్లి రోజును పురస్కరించుకుని ఈ ప్రకటన చేయడం ఆసక్తికరం. 13 జూన్ మధ్యాహ్నం ఒంటి గంటకు కింగ్ ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఉంటుందని ఓ పోస్టర్ ని రివీల్ చేశారు. ఈ పోస్టర్ లో నాగార్జున క్రౌన్ ధరించిన రియల్ కింగ్ అవతారంలో కనిపించడం ఆసక్తిని పెంచింది. ఇక టీజర్ తో ప్రచార బరిలోకి దిగిపోయినట్టేనని అర్థమవుతోంది. ఇక రాహుల్ రవీంద్రన్ పక్కాగా అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం చకచకా సినిమాని తెరకెక్కించేయడంపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. రకుల్ ప్రీత్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సమంత ఓ ఆసక్తికర పాత్రను పోషిస్తున్నారు. కీర్తి సురేష్ అతిధిగా మెరవనుంది. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవదాస్ తర్వాత కింగ్ ఎంతో ప్రతిష్ఠాత్కంగా భావించి చేస్తున్న సినిమా ఇది. కింగ్ కి 2018 ప్రతికూల ఫలితాల నేపథ్యంలో మన్మధుడు 2తో హిట్ కొట్టి తీరాలన్న కసితో పని చేస్తున్నారు. 13 జూన్ ప్రభాస్ .. నాగార్జున అభిమానులకు స్పెషల్ ట్రీట్ పక్కాగా ఖాయమైందన్నమాట.