Begin typing your search above and press return to search.

హే మెనినా అంటున్న అక్కినేనివారు

By:  Tupaki Desk   |   20 July 2019 7:00 AM GMT
హే మెనినా అంటున్న అక్కినేనివారు
X
అక్కినేని నాగార్జున రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం 'మన్మథుడు 2'. 'చిలసౌ' ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు.. టీజర్లతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. రిలీజ్ కు మరో ఇరవై రోజులే ఉండడంతో మన్మథుడు టీమ్ సభ్యులు ప్రమోషన్స్ లో జోరు పెంచుతున్నారు.

తాజాగా ఈ సినిమా నుండి 'హే మెనినా' అంటూ సాగే పాటను జులై 21 న సాయత్రం 5 గంటలకు విడుదల చేస్తామని 'మన్మథుడు 2' టీమ్ వెల్లడించింది. మెనినా అనేది పోర్చుగీస్ పదం. మెనినా అంటే అర్థం అమ్మాయి. సో.. మన అక్కినేనివారు 'ఓ అమ్మాయి' అంటూ పాటందుకున్నారన్నమాట. ఈ చిత్రానికి సంగీతం అందించినవారు 'RX100' ఫేమ్ చైతన్ భరద్వాజ్. ఈ పాట విడుదల సమయం తెలుపుతూ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ లో నాగ్ ఎవర్ గ్రీన్ లుక్ లో యమా స్టైలిష్ గా కనిపిస్తున్నారు.

ఈ సినిమా 'మన్మథుడు' చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ చార్ట్ బస్టర్ మ్యూజిక్ అందించాడు.. ఆల్బమ్ లో అన్నీ పాటలు హిట్సే.. మరి చైతన్ భరద్వాజ్ ఆ రేంజ్ మ్యూజిక్ ను మ్యాచ్ చేయగలడా లేదా అనేది వేచి చూడాలి. రేపు రిలీజ్ కానున్న ఫస్ట్ సాంగ్ ఈ అల్బమ్ కు ఒక శాంపిల్ లాంటిది అనుకోవచ్చు.