మన్మథుడు దెబ్బకు ఇంకా కోలుకోలేదా?

Fri Oct 11 2019 07:00:01 GMT+0530 (IST)

Manmadhudu 2 Effect on Rahul Ravindran

ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్.. ఫెయిల్యూర్ ఎవరిపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయంటే మొదట నిర్మాతపై.. రెండోది దర్శకుడిపై.  నిర్మాతకు ఫ్లాప్స్ ఎదురైనా చేతిలో డబ్బు ఉంటే మరో సినిమా తీసుకోగలరు కానీ డైరెక్టర్ల పరిస్థితి అలా ఉండదు.  గట్టిగా ఒక ఫ్లాప్ తగిలితే కెరీర్ అటూ ఇటూ అవుతుంది. 'బ్రహ్మోత్సవం' ఎఫెక్ట్ శ్రీకాంత్ అడ్డాలపై ఎలా పడిందో అందరికీ తెలుసు. 'ఇంటెలిజెంట్' తర్వాత మాస్ డైరెక్టర్ వినాయక్ ఏకంగా హీరోగా మారాల్సి వచ్చింది.  అయితే వర్మలాంటి వారు మాత్రం ఇలాంటివాటికి పూర్తిగా అతీతం.  'ఆఫీసర్' తర్వాత కూడా ఆయిన ఇంకో అరడజను సిన్మాలు తాపీగా తీసుకోగలడు!అయితే అంత లక్కు.. గట్స్ అందరికీ ఉండవుకదా.  ఈమధ్య రాహుల్ రవీంద్రన్ కు ఫ్లాప్ డైరెక్టర్లకు ఎదురయ్యే పరిస్థితే ఎదురైంది. రాహుల్ తన మొదటి సినిమా 'చిలసౌ' తో అందరినీ మెప్పించాడు. మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే నెక్స్ట్ సినిమా 'మన్మథుడు 2' తో ఎంత చెడ్డపేరు రావాలో అంతా వచ్చింది. అడల్ట్ కంటెంట్ ను ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ పేరుతో ప్రమోట్ చేయడంతో హీరో అక్కినేని నాగార్జునపై కూడా విమర్శలు వచ్చాయి. సినిమా ఫలితం కూడా నిరాశపరిచింది. ఈ సినిమా ఫ్లాప్ ఎఫెక్ట్ రాహుల్ కెరీర్ పై పడిందనే టాక్ వినిపిస్తోంది.  అయితే 'మన్మథుడు 2' రాహుల్ స్వయంగా ఎంచుకున్న సబ్జెక్ట్ కాదు.  ఓ ఫ్రెంచ్ సినిమాను రీమేక్ చేయమని నాగ్ బలవంతం చేస్తే రాహుల్ నో చెప్పలేక చేసిన సినిమా.

అవన్నీ ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? ఏదేమైనా రాహుల్ ఖాతాలో ఒక ఫ్లాప్ పడింది.  ఒక స్టార్ హీరోకు ఫ్లాప్ ఇస్తే దాని ఇంపాక్ట్ డైరెక్టర్ పై ఖచ్చితంగా ఉంటుంది.  ప్రస్తుతం రాహుల్ పరిస్థితి అలానే ఉందట.  మరి ఇందులో నుంచి బయటకు వచ్చి ఎప్పుడు రాహుల్ తన నెక్స్ట్ ఫిలిం చేస్తాడో వేచి చూడాలి.