మరిది సినిమాలో మంజుల ఘట్టమనేని!

Tue Jan 24 2023 09:00:01 GMT+0530 (India Standard Time)

Manjula Ghattamaneni in sudheer babu hunt movie

సుధీర్ బాబు హీరోగా దర్శకుడు మహేశ్ తెరకెక్కుతోన్న చిత్రం హంట్. ఈ హంట్ చిత్రంలో వెటరన్ హీరో శ్రీకాంత్ తో పాటు ప్రేమిస్తే భరత్ హంట్ లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే సుధీర్ బాబు వదిన మంజుల ఘట్టమనేని కూడా సినిమాలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అయితే చిత్ర షూటింగ్ సమయంలో పాల్గొంటున్నప్పటి ఫొటోలను మంజుల ఘట్టమనేని ఇన్ స్టా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. చెక్ ఔట్ మై లుక్ ఇన్ హంట్. మూవీ రిలీజింగ్ ఆన్ జనవరి 26 సూపర్ ఎగ్జైటెడ్  అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు.  దీంతో హంట్ చిత్రం గురించి మరోసారి చర్చ మొదలైంది. సుధీర్ బాబు సినిమాలో మంజులా కీలక పాత్ర పోషిస్తుండటం పట్ల సూపర్ స్టార్ కృష్ణా మహేశ్ బాబుల ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.ఈ పొటోలో గ్రీన్ కలర్ చీర మెరూన్ కలర్ బ్లౌజ్ లో మంజుల మెరిసిపోతూ కనిపిస్తున్నారు. ఎదురుగా ఆమె మరిది సుధీర్ బాబు బ్లాక్ టీ షర్టు వేసుకొని కూర్చున్నారు. వీరిద్దరూ ఫొటో తీస్తున్న వ్యక్తి వైపు చూస్తూ క్యూట్ గా స్మైల్ ఇచ్చారు. అలాగే మరో ఫొటోలో సుధీర్ బాబు... వదిన మంజులతో ఏదో చర్చిస్తున్నారు. ఈ ఫొటోలో లైటింగ్ బాయ్స్ కూడా కనిపిస్తున్నారు. ఈ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ తమదైన స్టైల్ లో కామెంట్లు చేస్తున్నారు.

వదినా మరిది సినిమా అంటే మామూలుగా ఉండదని కొందరు కామెంట్ చేస్తుండగా... మరికొందరేమో సినిమా కోసం వెయిటింగ్ అంటూ చెప్తున్నారు. ట్రైలర్ అదిరిపోయింది అక్కా అంటు ఓ నెటిజెన్ కామెంట్ చేశాడు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఓల్ టీం అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పోలీస్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకోనుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.