మాట తప్పినందుకు హీరోయిన్ కు చేదు అనుభవం

Mon Feb 11 2019 22:25:48 GMT+0530 (IST)

Manju Warrier fails to keep a promise

మలయాళ సీనియర్ హీరోయిన్ మంజు వారియర్ కు అనుకోని కష్టం వచ్చి పడింది. ఈమె 18 నెలల క్రితం ఒక ప్రాంతంకు పర్యటనకు వెళ్లింది. ఆ సమయంలో స్థానికంగా నివాసం ఉండే వారికి 57 ఏళ్లు పక్కా ఇల్లులు కటి ఇస్తానంటూ హామీ ఇచ్చింది. స్లమ్ లో ఉంటూ ఇబ్బంది పడుతున్న వారు మంజు వారియర్ ప్రకటనతో సంతోషం వ్యక్తం చేశారు. మంజు ప్రకటించి 18 నెలలు దాటింది. కాని ఇప్పటి వరకు ఆ ఇల్లకు సంబంధించిన ఇటుక పడింది లేదు. దాంతో ఆ ప్రాంతంకు చెందిన జనాలు మంజు వారియర్ ఇంటి ముందు దర్నాకు దిగబోతున్నారు.ఇల్ల నిర్మాణం కోసం మంజు ప్రభుత్వంతో చర్చలు జరపడం మరియు ఇతరత్ర చర్చలు కూడా అయ్యాయి. కాని పనులు మాత్రం ఇంకా ప్రారంభం కాకపోవడంకు కారణం ఏంటీ అంటూ వారు ప్రశ్నించారు. హామీ ఇచ్చి ఇప్పుడు నా వల్ల కాదంటే మంజు వారియర్ ను వదలమంటూ హెచ్చరించారు. మంజు హామీ ఇవ్వకుంటే ప్రభుత్వం అయినా ఇప్పటి వరకు తమకు పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చేదని మంజు ఎంట్రీ వల్ల తమకు ఇల్లు రాలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలోనే తమ సమస్య పరిష్కరించాలని లేదంటే ఈనెల 13వ తారీకున ఇంటి ముందు దర్నాకు దిగుతామంటూ ఇప్పటికే మంజు వారియర్ ను ఆ ప్రాంత వాసులు హెచ్చరించారు.

పబ్లిసిటీ కోసం ప్రకటన చేసిందో లేదా మరేంటో కాని ఇప్పుడు మంజు వారియర్ చిక్కుల్లో పడింది. మరో రెండు మూడు రోజుల్లో ఆ విషయమై ప్రకటన చేయకుంటే మాత్రం ఆమె ఇంటి ముందు దర్నా చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అదే జరిగితే మాత్రం మంజు పరువు గంగలో కలిసినట్లే అంటూ కేరళ సినీ వర్గాల వారు అంటున్నారు. ఈ వయస్సులో కూడా హీరోయిన్ గా ఆపర్లు దక్కించుకుంటున్న మంజు వారియర్ ఇలాంటి చిక్కుల్లో ఇరుక్కోవడం బాధాకరం.