శిష్యులకు కాంపిటీషన్ ఇస్తున్న స్వర బ్రహ్మ!

Fri Nov 22 2019 07:00:01 GMT+0530 (IST)

Manisharma Worked for Chiranjeevi And Koratala Siva Movie

ఇండస్ట్రీలో ఎవరికైనా ఓ టైం అంటూ ఉంటుంది. ఆ టైం అయిపోగానే ఎంత ప్రతిభావంతులైనా పక్కకి జరగాల్సిందే. పైగా ఇప్పుడొస్తున్న కొత్త జనరేషన్ లో అప్పటి తరం టెక్నీషియన్స్ పనిచేయలేరు కూడా. అందుకే కొన్నాళ్ళు మ్యూజిక్ కి చెక్ పెట్టేసారు మణిశర్మ. ఒక టైంలో బడా సినిమాలకు ఆయనే బెస్ట్ సపోర్టింగ్ సిస్టం. తన నేపథ్య సంగీతం పాటలతో ఎన్నో హిట్ సినిమాలకు ప్లస్ అయ్యారు.అయితే మొన్నీ మధ్యే  సంగీత దర్శకుడిగా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మణి శర్మ 'ఇస్మార్ట్ శంకర్' తో హాట్ టాపిక్ అయ్యాడు. మొన్నటి వరకూ ఆ సినిమా పాటలు గట్టిగా మోగాయి.ఆ సినిమాకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడనే ఫ్యీడ్ బ్యాక్ కూడా అందుకున్నాడు. ఆ సినిమానే ఇప్పుడు మణికి ఓ మూడు పెద్ద సినిమాలు తెచ్చిపెట్టింది.  ప్రస్తుతం 'రెడ్' సినిమాతో పాటు శ్రీ విష్ణు కొత్త సినిమాకు అలాగే గోపీచంద్ సినిమాకు సంగీతం అందిస్తున్న మణి శర్మ త్వరలోనే చిరు కొరటాల సినిమాకు సంగీతం అందించబోతున్నాడు.

మెగా స్టార్ సినిమాకు మణిశర్మ ఫైనల్ అవ్వగానే ఇక శిష్యులకు గట్టి పోటీ ఇస్తున్నాడే అనే కాంప్లిమెంట్ అందుకుంటున్నాడు. మరి ఇలా వరుస సినిమాలతో మళ్ళీ పుంజుకున్న స్వర బ్రహ్మ ఇదే స్పీడ్ ను కంటిన్యూ చేస్తాడా చూడాలి.