మెగాస్టార్ కోసం ఇస్మార్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్!

Tue Nov 19 2019 17:49:26 GMT+0530 (IST)

Manisharma Worked for Chiranjeevi And Koratala Siva Movie

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న  #చిరు152 సినిమాను దసరా సందర్భంగా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.  ఈ సినిమాకు ప్రస్తుతం నటీనటులను.. టెక్నిషియన్లను ఫైనలైజ్ చేసే పనిలో దర్శకుడు కొరటాల బిజీగా ఉన్నారు.  తాజాగా ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా మణి శర్మను ఎంచుకున్నారని సమాచారం.మణి శర్మ తన కెరీర్ ఆరంభంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా.. మెలోడీ బ్రహ్మగా పేరు తెచ్చుకున్న మాట వాస్తవమే కానీ ఆ తర్వాత ఆయన కెరీర్ నెమ్మదించింది.  ఈమధ్య ఆయన మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు.  ముఖ్యంగా 'ఇస్మార్ట్ శంకర్' చిత్రానికి మణి అందించిన మ్యూజిక్ ఆయనకు సూపర్ క్రేజ్ తీసుకొచ్చింది.  అందుకే ఇప్పుడు పెద్ద చిత్రాలకు కూడా మణిశర్మ పేరును పరిశీలిస్తున్నారు.  మరోవైపు ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోలకు మ్యూజిక్ అందించగలిగిన మ్యూజిక్ డైరెక్టర్స్ తక్కువమంది ఉన్నారు.  దీంతో ఇతర బాషల నుంచి సంగీత దర్శకులను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.  #చిరు152 సినిమాకు మొదట బాలీవుడ్ సంగీత దర్శకుడిని తీసుకోవాలనే అనుకున్నారట. అయితే ఈ సినిమాకు నేపథ్య సంగీతం కూడా కీలకం కావడంతో సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన మణి శర్మకే ఓటు వేసినట్టు సమాచారం.

మణిశర్మ తన కెరీర్లో మెగాస్టార్ కు ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించారు.  'చూడాలని ఉంది'.. 'అన్నయ్య'.. 'బావగారు బాగున్నారా'.. 'ఇంద్ర'.. ఇలా లిస్టు పెద్దదే. ఇప్పుడు మరోసారి మెగాస్టార్ - మణిశర్మ కాంబినేషన్ ఆసక్తి రేపుతుందని చెప్పడంలో అనుమానం లేదు.  మరోవైపు.. ఈ దశలో మణి శర్మకు ఇలాంటి ప్రాజెక్టు దక్కడం ఒక జాక్ పాట్ అనే చెప్పాలి. మరి మెలోడి బ్రహ్మ ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటారో వేచి చూడాలి.