Begin typing your search above and press return to search.

'బాహుబ‌లి' ఫార్ములా మ‌ణిర‌త్నంకు క‌లిసొచ్చేనా?

By:  Tupaki Desk   |   5 July 2022 7:23 AM GMT
బాహుబ‌లి ఫార్ములా మ‌ణిర‌త్నంకు క‌లిసొచ్చేనా?
X
ఇప్ప‌డు ఎక్క‌డ చూసినా 'బాహుబ‌లి' స్ఫూర్తితో భారీ చిత్రాల నిర్మాణం జ‌రుగుతోంది. కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు మ‌న సినిమాని స్ఫూర్తిగా తీసుకుని భారీ స్థాయిలో ప్ర‌యోగాత్మ‌క పీరియాడిక‌ల్ మూవీస్ తో స్టార్ డైరెక్ట‌ర్లు రంగంలోకి దిగుతున్నారు. ఇందులో ముందు వ‌రుస‌లో నిలుస్తున్న ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం. గ‌త కొన్నేళ్లుగా త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ గా 'పొన్నియిన్ సెల్వ‌న్‌' ని తెర‌పైకి తీసుకురావాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. మొత్తానికి లైకా ప్రొడ‌క్ష‌న్స్ ముందుకు రావ‌డంతో త‌న చిర‌కాల స్వ‌స్నాన్ని వెండితెర‌పై ఆవిష్క‌రించారు.

'బాహుబ‌లి' ఫార్ములాని అనుస‌రించి ఈ మూవీని కూడా మ‌ణిర‌త్నం రెండు భాగాలుగా తెర‌పైకి తీసుకొస్తున్నారు. విక్ర‌మ్, ఐశ్వ‌ర్యారాయ్‌, కార్తి, జ‌యం ర‌వి, త్రిష వంటి కీల‌క తారాగ‌ణం న‌టిస్తున్న ఈ మూవీ ఫ‌స్ట్ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. సెప్టెంబ‌ర్ 30న ఈ మూవీని ఐదు భాష‌ల్లో వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ చిత్రంలోని కీల‌క పాత్ర‌ల‌ని ప‌రిచ‌యం చేస్తూ ఫ‌స్ట్ లుక్ పోస్టర్ ల‌ని విడుద‌ల చేస్తున్నారు.

సోమ‌వారం విక్ర‌మ్ పాత్ర‌కు సంబంధించిన లుక్ ని విడుద‌ల చేశారు. ఇందులో విక్ర‌మ్ చోళ ఎంపైర్ లోని వైల్డ్ టైగ‌ర్ ఆదిత్య క‌రికాల‌న్ గా క‌నిపించ‌బోతున్నారు. ఆయ‌న లుక్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది. అత్యంత ప‌వ‌ర్ ఫుల్ రాజుగా విక్ర‌మ్ ఇందులో క‌నిపించ‌నున్నారు. క‌ల్కీ కృష్ణ మూర్తి రాసిన 'పొన్నియిన్ సెల్వ‌న్' న‌వ‌ల ఆధారంగా తెర‌కెక్కుతున్న‌ పీరియాడిక‌ల్ డ్రామాగా ఈ మూవీని దాదాపు 500 కోట్ల భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలోని కార్తి లుక్ ని మంగ‌ళ‌వారం మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇందులో కార్తి వ‌ల్ల‌వ రాజ‌న్ వందియ దేవ‌న్ పాత్ర‌లో బ్రేవ్ ప్రిన్స్ గా క‌నిపించ‌బోతున్నారు. బ్లాక్ క‌ల‌ర్ క‌వ‌చంతో... గుర్రంపై స్వారీ చేస్తూ చిరున‌వ్వులు చిందిస్తున్న కార్తి లుక్ ఆకట్టుకుంటోంది. 'కాట్రు విలియిడై' త‌రువాత మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో కార్తి న‌టిస్తున్న రెండ‌వ చిత్ర‌మిది. ఈ మూవీపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నాడ‌ట‌.

భారీ బ‌డ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీపై ఇప్ప‌టికే భారీ బ‌జ్ క్రియేట్ అయింది. అయితే 'బాహుబ‌లి' ఫార్ములాని ఫాలో అవుతూ తెర‌కెక్కిస్తున్న ఈ మూవీ మ‌ణిర‌త్నం కు క‌లిసివ‌స్తుందా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

రాజ‌మౌళి త‌ర‌మాలో భావోద్వేగాల్ని పండించ‌గ‌లిగితేనే ఈ త‌ర‌హా లార్జ‌ర్ దెన్ లైఫ్ సినిమాల‌కు బాక్సాఫీస్ వ‌ద్ద క్రేజ్ ఏర్ప‌డుతుంది. అలా కాని ప‌క్షంలో స‌గ‌టు ప్రేక్ష‌కుడిని ఆక‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మనే వాద‌న వినిపిస్తోంది. మ‌రి మారిన స‌మీక‌ర‌ణాలు, ప్రేక్ష‌కుడి ఆలోచ‌న నేప‌థ్యంలో థియేట‌ర్ల‌లో విడుద‌ల కానున్న ఈ మూవీ మ‌ణిరత్నం కు క‌లిసి వ‌చ్చేనా అన్న‌ది తెలియాలంటే సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.