మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ఇక ఒక్కొక్కటిగా!

Sat Jul 02 2022 17:14:28 GMT+0530 (IST)

Mani Ratnam dream project one by one

స్టార్ మేకర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియన్ సెల్వన్` ఆన్ సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. సినిమా ప్రారంభమై చాలా కాలమవుతోన్న షూటింగ్ నెమ్మదిగా జరగడం..మధ్యలో కోవిడ్ రావడం..టెక్నికల్ సమస్యలు ఇలా పలు కారణాలుగా `పొన్నియన్ సెల్వన్`  షెడ్యూల్ ప్రకారం ముందుకు వెళ్లలేదు. అయితే కోవిడ్ తగ్గిన నాటి నుంచి షూటింగ్ స్పీడప్ అయింది.కొన్ని నెలలుగా యూనిట్ రేయింబవళ్లు షూటింగ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ చివరి దశకు వచ్చినటు  తెలుస్తోంది. మరోవైపు ఏకధాటిగా  పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరగడంతో దాదాపు పొన్నియన్ సెల్వన్ క్లైమాక్స్ చేరుకున్నట్లే కనిపిస్తోంది. ఇదంతా మీడియా కున్న సమచారం..ఊహా గానమే. ఇప్పటి వరకూ సినిమాకి సంబంధించిన అప్ డేడ్ గా తెలుస్తోంది.

అయితే  ఇక పై ఊహాగానాలకు తెర దించుతూ నేరుగా చిత్ర యూటిన్ నే అప్ డేట్స్ ఇవ్వడానికి ముందుకొస్తున్నట్లు ప్రకటించింది. సినిమాకి సంబంధించిన ప్రతీ విషయం మీడియాకి వెల్లడిస్తామని  తెలిపారు. సెప్టెంబర్ 30న  చిత్రాన్ని భారీ  ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ వాయిదా పడే అవకాశం కూడా కనిపించలేదు.

ప్రకటించిన తేదీ గా చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చేలా సన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. రిలీజ్ కి సరిగ్గా మూడు నెలలు సమయం ఉంది కాబట్టి ఇకపై ఒక్కొక్కటిగా ప్రచారం పనులు కూడా మొదలు పెట్టే అవకాశం ఉంది. ఇప్పటివరకూ సినిమాకి ఎలాంటి బజ్ తీసుకురాలేదు. కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా రాసుకున్న కథ అన్న విషయం తప్ప సినిమా ఎలా ఉండబోతుంది? అన్నది ఎక్కడా  హింట్ ఇవ్వలేదు.

దీంతో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది.  మోషన్ పోస్టర్...టీజర్..ట్రైలర్ రిలీజ్ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. పైగా మణి డ్రీమ్ ప్రాజెక్ట్ గా ప్రకటించడంతో సినిమాపై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి.

ఈ చిత్రాన్ని భారీ తారాగాణంపై తెరకెక్కిస్తున్నారు. చియాన్ విక్రమ్..కార్తీ..జయం రవి ..ఐశ్వర్యారాయ్ తదితరలు నటిస్తున్నారు.  ఈ చిత్రానికి ఏ.ఆర్ రెహమాన్ సంగీతం  అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా  ప్రొడక్షన్స్ -మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.