Begin typing your search above and press return to search.

కన్నప్ప కోసం మంచు హీరో వేట

By:  Tupaki Desk   |   21 April 2019 10:33 AM GMT
కన్నప్ప కోసం మంచు హీరో వేట
X
గత కొంత కాలంగా సక్సెస్ లేక గ్యాప్ తీసుకున్న మంచు విష్ణు కొత్త సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఎన్నికల సందర్భాన్ని వాడుకుంటూ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఓటర్ విడుదల చేస్తారనే టాక్ వచ్చింది కాని ఎందుకనో మరి దాని తర్వాత ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. ఇప్పుడు విష్ణు న్యూజిల్యాండ్ లో ఉన్నాడు. తన కలల ప్రాజెక్ట్ అయిన కన్నప్ప కోసం లొకేషన్ల వేట కోసం అక్కడికి వెళ్ళాడు.

దీనికి సంబంధించిన అప్ డేట్ ఇస్తూ ఇటీవలే తన ఇన్స్ టాగ్రామ్ లో ఫోటోతో పాటు వీడియో పోస్ట్ చేసిన విష్ణు భార్య వేరోనికతో అక్కడికి తీసుకెళ్లనందుకు తీయని తిట్లు కూడా తిన్నాడు. విష్ణు అక్కడ ఎన్ని రోజులు ఉంటాడు కన్నప్ప షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసే ప్లాన్ ఉంది లాంటి వివరాలేమీ ఇంకా తెలియలేదు.

భారీ బడ్జెట్ తో రూపొందే కన్నప్పను గతంలో ఇద్దరు తీయాలని ప్రయత్నించారు. సునీల్ టైటిల్ రోల్ లో తనికెళ్ళ భరణి దర్శకత్వంలో రూపొందే ఆలోచన జరిగింది. కాని కార్యరూపం దాల్చలేదు. టాలీవుడ్ వరకు కన్నప్ప అనగానే గుర్తొచ్చే కృష్ణంరాజు గారు ప్రభాస్ తో దీన్ని తెరకెక్కించాలని అనుకున్నారు. అదీ జరగలేదు. ప్రభాస్ ఇమేజ్ కి ఈ కథ ఎంత వరకు సూటవుతుందన్న అనుమానాలు అభిమానులకే ఉన్నాయి.

ఈ నేపధ్యంలో ఇది ఫైనల్ గా విష్ణుకు వచ్చి చేరింది. శివభక్తుడిగా కన్నప్ప కథ చాలా గొప్పది. అందుకే బాపు రమణలు దాన్నో దృశ్యకావ్యంగా మలచారు. దానికి ఏ మాత్రం తీసిపోని రీతిలో కొత్త టెక్నాలజీని వాడుకుంటూ చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా తీయాలని విష్ణు ప్లాన్. మొదలుపెట్టాక పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది