Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ తో మంచు హీరో భేటీ..!

By:  Tupaki Desk   |   14 Oct 2021 4:30 PM GMT
పవన్ కళ్యాణ్ తో మంచు హీరో భేటీ..!
X
టాలీవుడ్ స్టార్ హీరో, జన సేనాని పవన్ కళ్యాణ్ అంటే రాకింగ్ స్టార్ మంచు విష్ణు కి ప్రత్యేకమైన అభిమానం అనే సంగతి తెలిసిందే. అలాగే మనోజ్ పట్ల పవన్ కూడా ఎంతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారు. గతంలో అనేక సందర్భాల్లో వీరిద్దరూ ఆప్యాయంగా పలకరించుకోవడం మనం చూశాం. ఇటీవల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల నేపథ్యంలో పవన్ - మనోజ్ ఒకరికొకరు హత్తుకొని మాట్లాడుకుంటూ ఒకరిపై ఒకరికి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అయితే గురువారం పవన్ కళ్యాణ్ ను మనోజ్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'భీమ్లానాయక్‌' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ లో పవన్ పాల్గొనే కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ సెట్స్ లోనే పవన్‌ ను మనోజ్‌ కలిశారు. 'మా' ఎన్నికల కారణంగా ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వీరిద్దరి భేటీ ఆసక్తి రేపింది. అయితే ఇద్దరూ దాదాపు గంటసేపు ముచ్చటించగా.. సినిమాలపైనే ఎక్కువగా చర్చించుకుంటున్నట్లు సమాచారం. మెగా - మంచు హీరోల భేటీకి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

మంచు మనోజ్ సోషల్ మీడియా వేదిగా పవర్ కళ్యాణ్ ని మీట్ అయిన విషయాన్ని వెల్లడించారు. ''పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో సమావేశం ఎల్లప్పుడూ ఒక ఆహ్లాదకరమైనది. ఒక శక్తివంతమైన అనుభవం. హార్ట్ ఫుల్ గా మాట్లాడారు. మీ మాటలకు నా మీద కురిపించిన ప్రేమకు ధన్యవాదాలు అన్నా. లవ్ యూ మచ్. జై హింద్'' అని మనోజ్ ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పవన్ తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు. ఇందులో పవన్ పంచె కట్టులో భీమ్లా నాయక్ గెటప్ లో ఉండగా.. మనోజ్ బ్లాక్ క్యాజువల్స్ ధరించి ఉన్నారు. ఈ ఫోటోలను చూసిన అభిమానులు సమాజ హితం కోరే వీరిద్దరూ కలిసి ఓ మల్టీస్టారర్ చేస్తే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక సినిమాల పవన్ కళ్యాణ్ 'భీమ్లానాయక్‌' తో పాటుగా 'హరిహర వీరమల్లు' సినిమా చేస్తున్నారు. దీని తర్వాత 'భవదీయుడు భగత్ సింగ్' మరియు సురేందర్ రెడ్డి చిత్రాల్లో నటించనున్నారు. మరోవైపు మంచు మనోజ్ స్వీయ నిర్మాణంలో 'అహం బ్రహ్మాస్మి' అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టారు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.