మంచు హీరో రెడ్ ఫసక్ కార్

Tue Nov 19 2019 18:06:02 GMT+0530 (IST)

Manchu Manoj Fassak Car

ఫసక్ అనే పదానికి మంచు హీరోలకు ఉన్న సంబంధం తెలిసిందే. పుల్వామా ఉగ్ర దాడి నేపథ్యంలో భారత వాయుసేన పాకిస్థాన్ సరిహద్దుల్లోని జేషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది. పాక్ సరిహద్దు ప్రాంతాలైన బాలాకోట్ లోని ఉగ్రవాదుల శిబిరాలపై భారత వాయుసేన వార్ తెలిసిందే. ఈ దాడిపై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనదైన శైలీలో స్పందిస్తూ .. `ఫసక్` అనే పదం వాడటంతో అది యువతరంలో చాలా ఫేమస్ అయింది. సోషల్‌మీడియాలోనూ ఆ పదం తెగ వైరల్ అయింది.ఆ తర్వాత ఫసక్ యూత్ లో ఎంత వైరల్ అయ్యిందో తెలిసిందే. ఇటీవల ఫసక్ పేరుతో ఏకంగా యాప్ నే రూపొందిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఇక ఇదే పదాన్ని మంచు హీరోలు.. మంచు లక్ష్మి సహా పలువురు పలు వేదికలపై విస్త్రతంగా ఉపయోగించారు. తాజాగా మంచు మనోజ్ తన కొత్త రెడ్ కార్ కి నంబర్ ప్లేట్ పైనే ఫసక్ (ఎఫ్.ఏ.ఎస్.ఎస్.ఏ.కే) అని ప్రింట్  వేయించడంతో దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఫసక్ రెడ్ కార్ ఫోటోని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన మనోజ్.. ఐ వేక్ అప్ టు దిస్.. #ఫసక్.. హ్యావ్ ఏ ఫెంటాస్టిక్ డే! అంటూ తనదైన శైలిలో ఫన్నీ కామెంట్ ని చేశాడు. అన్నట్టు మనోజ్ సినిమాల నుంచి వైదొలగుతున్నానని ప్రకటించి తిరిగి ఆలోచన మార్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సొంతంగా ఎం.ఎం.ఆర్ట్స్ బ్యానర్ ని ప్రారంభించి ఈ బ్యానర్ లో తనే నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్నాడు. ఈ బ్యానర్ లో కొత్త ట్యాలెంటుకు అవకాశాలు కల్పించనున్నాడు మనోజ్. రీఎంట్రీ మూవీ గురించి మనోజ్ నుంచి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.