మంచు లక్ష్మీ..మళ్లీ దొరికేసిందేట్రోలింగ్

Sun May 09 2021 12:01:43 GMT+0530 (IST)

Manchu Lakshmi trolling

రీసెంట్ గానే మంచు లక్ష్మి ..కేటీఆర్ కు కరోనా వచ్చినప్పుడు రెస్ట్ లో  తన సినిమాలు చూడమని సలహా ఇచ్చి దారుణమైన ట్రోలింగ్ కు గురి అయ్యింది. దానికి కౌంటర్ ఇచ్చి బయిటపడేలోగా మరోసారి నెట్ జనాలకు దొరికిపోయింది. అయితే ఈ సారి వాక్సిన్ విషయంలో. మంచు లక్ష్మీ తాజాగా కరోనా వ్యాక్సిన్ వేయించుకుంది.  ఆమె ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని పంచుకుంది. `ఇది గొప్ప రోజు. యశోధ ఆసుపత్రిలో నా మొదటి జాబ్ పూర్తయ్యింది. పరిశుభ్రత మంచి సేవతో ఆకట్టుకున్నారు. నాకిప్పుడు   చాలా రిలీఫ్‌గా ఉంది` అని పేర్కొంది.అంతేకాక 18ప్లస్ ఏజ్ వాళ్లంతా రిజిస్టర్ చేయించుకోమని   వాక్సిన్ చేయించుకోమని తెలిపింది. కరోనా మహమ్మారితో ఫైట్ చేయడానికి ఇదే బెస్ట్ స్టెప్ అని తెలిపింది. వ్యాక్సిన్ చేయించుకుని   ఫ్యామిలీ ఫ్రెండ్స్ ని ఎంకరేజ్ చేయమని చెప్పింది. ఈ సందర్భంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ధన్యవాదాలు తెలిపింది.అయితే వాక్సిన్ వేయించుకుంటే ట్రోలింగ్ ఎందుకు జరుగుతోంది అంటారా...  
 
ఇక్కడే అసలు సమస్య వచ్చింది. తెలుగు రెండు రాష్ట్రాల్లో  18ప్లస్ ఏజ్ వారికి వ్యాక్సిన్ ఇవ్వడం లేదు. వ్యాక్సిన్ డోసులు లేవని కేవలం 45ఏళ్లు పై బడిన వారికి అందులోనూ మొదటి డోస్ ఇప్పటికే వేసుకున్న వారికి మాత్రమే రెండో డోస్ వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా 45ఏళ్లు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ కూడా ఇవ్వడం లేదు. 18ఏళ్లు పైబడిన వారికి ఇప్పట్లో వ్యాక్సిన్ ఇవ్వలేమని అటు ఏపీ ఇటు తెలంగాణ ప్రభుత్వాలు తేల్చి చెప్పాయి. మరి మంచు లక్ష్మికి ఎలా వ్యాక్సిన్ దొరికింది. ప్రైవేట్ ఆసుపత్రులైనా.. వ్యాక్సిన్ ప్రభుత్వమే   అనుమతి ఇవ్వాల్సి ఉంది. మరి మంచు లక్ష్మీకి ఎలా వ్యాక్సిన్ వేశారనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆమె వయస్సు 43 సంవత్సరాలు మాత్రమే. ఇంకా 45  రాలేదు.

 దాంతో కొందరు మంచు లక్ష్మి తెలంగాణలోనే వేయించుకుందా? లేదంటే ఇతర స్టేట్స్ లో వేయించుకుందా? అనే డౌట్ పడ్డారు. అయితే తమిళనాడు బెంగుళూర్‌లో లాక్‌డౌన్ నడుస్తుంది. అక్కడికి వెళ్లే అవకాశమే లేదు. అంటే కచ్చితంగా ఆమె హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలోనే వేయించుకుని ఉంటుంది. మరి ఆమెకి వ్యాక్సిన్ ఎలా వేశారనేది ప్రశ్నగా మారింది.
 
ప్రభుత్వమే వ్యాక్సిన్ అధికారికంగా నిలిపివేస్తే మీకెలా దొరికింది. డబ్బులు పెట్టి వ్యాక్సిన్ వేయించుకున్నారా? అంటే సెలబ్రిటీలు వేయించుకుంటే చాలా సాధారణ ప్రజలకు వ్యాక్సిన్ అవసరం లేదా? అంటూ నెటిజన్లు   విరుచుకుపడుతున్నారు. సామాన్య జనం ఆరోగ్యాలు ప్రభుత్వాలకు ఆసుపత్రి వర్గాలకు పట్టవా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో అలాగే తెలంగాణలో మాకు వ్యాక్సిన్ ఇవ్వడం లేదు. రిజిస్టర్ చేయించుకోమంటున్నారు. కానీ నో స్లాట్. మీకు ఎలా దొరికిందో చెప్పండి. కామన్ పీపుల్‌కి సహాయం చేయండి అంటూ నెటిజన్లు కామెంట్ల   వర్షం కురిపిస్తున్నారు.

 ఆగకుండా లక్ష్మిని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఓ వైపు కామెంట్ల రూపంలో మరోవైపు ట్రోల్స్ రూపంలో విరుచుకుపడుతున్నారు. మాకు వ్యాక్సిన్ ఇప్పించండి అంటూ రీక్వెస్టులు పెడుతున్నారు. దీంతో   ఇప్పుడిది సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతుంది. మరి దీనిపై మంచు లక్ష్మీ ఎలా రియాక్ట్ అవుతుంది. ఆసుపత్రి వర్గాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.