నాగచైతన్య అంతగా చిలిపి పనులు చేస్తాడా?

Wed Oct 23 2019 07:00:01 GMT+0530 (IST)

మంచు లక్ష్మి తాజా టాక్ షో లో సెలబ్రెటీలు పలు రహస్యాలను చెప్పేస్తున్నారు. ఇప్పటికే సమంత.. రకుల్ ప్రీత్ సింగ్.. శృతి హాసన్ లు తమ వ్యక్తిగత విషయలను.. గతంలో ఏ ఇంటర్వ్యూల్లో చెప్పని విషయాలను చెప్పేశారు. ఈవారం ఇస్మార్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఇంటర్వ్యూ వచ్చింది. పలు ఆసక్తికర విషయాలను నిధి అగర్వాల్ ఈ ఇంటర్వ్యూలో చెప్పింది. తన ఫస్ట్ లవ్.. తన బ్రేకప్ విషయం ఇంకా క్రికెటర్ కేఎల్ రాహుల్ తో ఉన్న పరిచయం.. ప్రేమ వార్తలపై వివరణ ఇలా పలు విషయాల గురించి నిధి ముచ్చటించింది.ఈ టాక్ షోలో నిధి అగర్వాల్ 'సవ్యసాచి' షూటింగ్ సందర్బంగా జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ను షేర్ చేసుకుంది. నాగచైతన్య చూడ్డానికి రిజర్డ్వ్ గా అనిపించినా అతడు చాలా జోవిల్ అంటూ అతడితో వర్క్ చేసిన వారు అంటూ ఉంటారు. సవ్యసాచి సమయంలో దర్శకుడు చందు మొండేటి మరియు హీరో నాగచైతన్యలు కలిసి నేను చూడని సమయంలో నా రెండు షూ లేస్ ముడేశారు. దాంతో నేను నడవలేక పోయాను.

నడవలేక కింద పడితే మొహం పగిలితే షూటింగ్ క్యాన్సిల్ అవుతుంది కదా అంటూ అలా చేశామని నాగచైతన్య మరియు చందు మొండేటి చెప్పారంటూ నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది. నాగచైతన్య చేసిన ఈ చిలిపి పనితో నిజంగానే నిధి అగర్వాల్ మొహం పగిలేది. కాని తృటిలో తప్పించుకుందట. ఈమె నాగచైతన్యతో పాటు అఖిల్ తో కూడా 'మిస్టర్ మజ్ను' చిత్రంలో నటించిన విషయం తెల్సిందే.