మంచు వారి వెబ్ సిరీస్ తిప్పలు

Thu Feb 20 2020 09:38:45 GMT+0530 (IST)

Manchu Family Web Series Issues

మంచు విష్ణు నిర్మాణంలో ఇప్పటి వరకు సినిమాలే వచ్చాయి. మొదటి సారి చదరంగం అనే వెబ్ సిరీస్ రాబోతుంది. రేపటి నుండి జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ పై స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ఇన్ని రోజుల నుండి ఈ వెబ్ సిరీస్ గురించి పెద్దగా ప్రచారం చేయలేదు. దాంతో అసలు ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు హడావుడిగా పబ్లిసిటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. మొదట దీన్ని ఒక పొలిటికల్ డ్రామా అంటూ ప్రచారం చేసిన వారు ఇప్పుడు ఇది ఎన్టీఆర్ రియల్ లైఫ్ సంఘటన ఆధారంగా తెరకెక్కించడం జరిగిందంటున్నారు.వెబ్ సిరీస్ లకు తెలుగులో అంతంత మాత్రంగానే మార్కెట్ ఉంది. అలాంటిది ఈ వెబ్ సిరీస్ కు ఎక్కువ పబ్లిసిటీ చేయక పోవడంతో జనాలు ఎవరు దీన్ని పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. దాంతో నేడు మీడియా వారికి ఈ వెబ్ సిరీస్ ను వేసి చూపించడంతో పాటు వారితో ప్రచారం చేయించేందుకు ప్రయత్నాలు చేశాడు.

విడుదలకు ఒకటి రెండు రోజుల ముందు తెగ తిప్పలు పడుతున్నాడు. కాస్త భారీ బడ్జెట్ తోనే ఈ వెబ్ సిరీస్ ను మంచు విష్ణు నిర్మించినట్లుగా అనిపిస్తుంది. మరి ఆయన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా నిరాశ పర్చనుందా లేదంటే ప్రమోషన్ తో సంబంధం లేకుండా సక్సెస్ అయ్యేనో చూడాలి.