ఎప్పుడు 'ఆహా' మంచి రోజులు వచ్చాయి!

Wed Nov 24 2021 20:00:02 GMT+0530 (IST)

Manchi Rojulochaie Movie On OTT

సంతోష్ శోభన్ హీరోగా మెహ్రీన్ హీరోయిన్ గా మారుతి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ వారు నిర్మించిన మంచి రోజులు వచ్చాయి సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఖచ్చితంగా మంచి ఎంటర్ టైన్మెంట్ ను అందిస్తుందని అంతా ఆశించారు. కాని అనూహ్యంగా ఆ సినిమా నిరాశ పర్చింది. మారుతి మార్క్ ఎంటర్ టైన్మెంట్ ను సినిమా అందించలేక పోయింది అంటూ విమర్శలు వచ్చాయి. మారుతి కూడా తాను ఆశించిన స్థాయిలో ఎంటర్ టైన్మెంట్ ను అందించలేక పోయాను అంటూ ఒప్పుకున్నాడు. ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయిన కొన్ని వారాల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్దం అయ్యింది.నవంబర్ 4న విడుదల అయిన ఈ సినిమాను నాలుగు వారల తర్వాత అంటే డిసెంబర్ 3న ఆహా లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఆహా లో ఈ సినిమా స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈమద్య కాలంలో ఆహా లో స్ట్రీమింగ్ అయిన.. అవుతున్న సినిమాలు భారీ విజయాలను దక్కించుకున్నాయి. థియేటర్ లో చూడలేక పోవడంతో ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసేందుకు చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. అందుకే మంచి రోజులు వచ్చాయి సినిమా ను ఆహాలో స్ట్రీమింగ్ చేయడం కోసం ఓటీటీ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా థియేటర్లలో ఎలాగూ నిరాశ పర్చింది కనుక ఒక వారం ముందే స్ట్రీమింగ్ చేస్తే బాగుంటుంది కదా అంటూ కొందరు నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి రోజు పండుగే సినిమా తర్వాత దర్శకుడు మారుతి తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్న సమయంలో కరోనా వచ్చి ఏకంగా ఏడాది గ్యాప్ వచ్చింది. గోపీచంద్ హీరోగా పక్కా కమర్షియల్ సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా మారుతి ప్రకటించాడు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా ను వాయిదా వేశారు. ఆ గ్యాప్ లో కేవలం నెలన్నర రోజుల్లోనే మంచి రోజులు వచ్చాయి సినిమాను దర్శకుడు మారుతి పూర్తి చేశాడు. మెహ్రీన్ అందాల ఆరబోత చేసిన ఈ సినిమా హీరో సంతోష్ శోభన్ కు నటుడిగా మంచి పేరు తీసుకు వచ్చింది. దర్శకుడిగా మారుతి మరింత ఎంటర్ టైన్మెంట్ ను సినిమా ద్వారా అందిస్తే బాగుండేది అంటూ రివ్యూలు వచ్చాయి. మరి ఆహా లో రాబోతున్న మంచి రోజులు వచ్చాయికి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.