ఒమిక్రాన్ గురించి మమతా మోమన్ దాస్ సందేశం!

Sat Jan 15 2022 09:00:01 GMT+0530 (India Standard Time)

Mamata Mohan Das Message About Omicron

కరోనా మళ్లీ కోరలు చాచిన సంగతి తెలిసిందే. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీనికి తోడు సంక్రాంతి హడావుడి. జర్నీలు హడావుడి నడుమ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉస్తోంది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా వైరస్ సోకుతుంది. ఇప్పుడు మళ్లీ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన  సమయం ఆసన్నమైంది. మూతికి మాస్క్...జేబులో శానిటైజర్ పెట్టుకుని వెళ్లాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు సైతం అవేర్ నెస్ తీసుకొచ్చే ప్రయత్నాలు  మొదలు పెట్టారు. సోషల్ మీడియా వేదకిగా నటి మమతా మోహన్ దాస్  అందరూ మాస్క్  వేసుకోవాలని ఇన్ స్టా వేదికగా పిలుపునిచ్చింది.ఆమె మాస్క్ వేసుకున్న ఫోటోల్ని షేర్ చేసి అవేర్ నెస్ కల్పించే ప్రయత్నం చేసింది. పండగ సీజన్ కావడంతో చాలా మంది అశ్రద్ద చేసే అవకాశం ఉంది. జనాలు గుమిగూడటం వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించింది. మమతా మోహన్ దాస్ ప్రస్తుతం మలయాళం పరిశ్రమలో బిజీగా ఉంది. ఆమె చేతిలో 10 సినిమాలున్నాయి. తెలుగులో `యమదొంగ` సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొన్ని సినిమాల్లో నటిచింది. కానీ ఇక్కడ అంత సక్సెస్  కాలేదు.  దీంతో చివరిగా మలయాళ పరిశ్రమలో స్థిరపడింది. అయితే అక్కడ నటిగా కెరర్  పీక్స్ లో ఉండగా కేన్సర్ బారిన పడింది.  

ఆ వ్యాధి తో మనో నిబ్బరంతో పోరాటం చేసి గెలిచింది. ఈ క్రమంలో  ఆమె రూపంలో ఎన్నో మార్పులు వచ్చాయి.  అయినా పట్టు వదలలేదు. మునపటి గ్లామర్ ని సొంతం చేసుకుని నటిగా మళ్లీ బిజీ అయింది. ఆ రకంగా మమతా మోమన్ దాస్ ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. సోషల్ మీడియా  ద్వారా అభిమానులకు ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటుంది.