లాయర్ కం నటి కిల్లర్ లుక్ వైరల్

Sat Jul 02 2022 07:00:01 GMT+0530 (IST)

Malvika Sharma Killer Look

మాళవిక శర్మ .. పరిచయం అవసరం లేదు. లాయర్ కం నటిగా తెలుగు పరిశ్రమకు సుపరిచితమైన ఈ బ్యూటీ ఇటీవల ఇరుగు పొరుగు భాషల్లోనూ వరుసగా అవకాశాలు అందుకుంటోంది. బాలీవుడ్ లో సల్మాన్ భాయ్ సరసన క్రేజీ ఆఫర్ అందుకున్న ఈ బ్యూటీ ఇటు తమిళంలో సుందర్ సి దర్శకత్వంలోను నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు మాళవిక వరుస ఫోటోషూట్లతో సామాజిక మాధ్యమాల్లో విరుచుకుపడుతోంది.తాజాగా మాళవిక షేర్ చేసిన స్టైలిష్ ఫోటోగ్రాఫ్ ఒకటి అంతర్జాలంలో వైరల్ గా మారింది.  బ్లాక్ ఇన్నర్ కి కాంబినేషన్ గా స్టైలిష్ సూట్ ఫ్యాంట్ లో కనిపించింది. ఇక బ్లేజర్ ని అలా భుజాల మీదుగా ఉంచి కిల్లింగ్ లుక్ తో కట్టి పడేస్తోంది.

ముంబై టాప్ మోడల్ మాళవిక శర్మ వృత్తిరీత్యా నటి.. ప్రవృత్తి రీత్యా లాయర్ అన్న సంగతి తెలిసిందే. ఇటీవల నటనపైనే పూర్తిగా దృష్టి సారించారు. 2018 లో రవితేజ నేల టికెట్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ న్యాయశాస్త్ర విద్యార్థిని ఆ తర్వాతా సినిమాల్లో నటిగా వెలిగేందుకు గట్టి ప్రయత్నాల్లో ఉంది. ఇటీవల రామ్ సరసన రెడ్ లో కనిపించిన ఈ బ్యూటీ త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ తో కలిసి 'ఆహా' ప్రమోషనల్ వీడియోలోనూ కనిపించింది.

ప్రవృత్తి రీత్యా లాయర్ కాబట్టి ఆ వృత్తిని మాళవిక విడిచిపెట్టడం లేదు.మాళవిక శర్మ హైదరాబాద్ హైకోర్టులో జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారని తాజాగా తెలుస్తోంది. 2020 నవంబర్ లో ముంబైలోని రిజ్వి లా కాలేజీ నుండి మాళవిక ఎల్.ఎల్.బిలో పట్టభద్రురాలయ్యారు. జనవరి 2021 లో మహారాష్ట్ర - గోవాలోని బార్ కౌన్సిల్ నుండి లైసెన్స్ పొందారు. ముంబై విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.ఎమ్ లోనూ మాళవిక ప్రవేశం పొందారు.

ఆమె ప్రవేశ పరీక్షను క్లియర్ చేసారని తెలిసింది. ప్రస్తుతం క్రిమినాలజీలో నైపుణ్యం సంపాదిస్తోంది.  సల్మాన్ భాయ్ - ఫర్హాన్ సామ్జీ కాంబినేషన్ యాక్షన్ కామెడీలో మాళవిక అవకాశం దక్కించుకుందని ఇటీవల కథనాలొచ్చాయి.

అలాగే సుందర్ సి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం కాఫీ విత్ కాదల్ లో నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ కి చక్కని స్పందన వచ్చింది. తెలుగులోనూ పలు ప్రాజెక్టులకు కమిటైంది. వాటి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.