బాబోయ్ పిల్లలను కని పెంచడం నా వల్ల కాదు

Wed Sep 18 2019 21:50:36 GMT+0530 (IST)

Mallika Sherawat says she isnt ready to be a mother

ఒకప్పుడు ఇండియన్ స్క్రీన్ పై తన అందాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ముద్దుగుమ్మ మల్లికా షెరావత్ గత కొంత కాలంగా ఇంగ్లీ.. చైనీస్ ఇంకా పలు భాషల చిత్రాల్లో నటిస్తూ అంతర్జాతీయ స్థాయలో గుర్తింపు దక్కించుకుంది. సినిమాలు వెబ్ సిరీస్ లు అంటూ 42 ఏళ్ల వయసులో కూడా చాలా బిజీగా గడుపుతున్న మల్లికా షెరావత్ తన సోదరుడి కొడుకు అయిన రాన్షెర్ లాంబాతో మాత్రం ఎక్కువ సమయం గడిపేందుకు వీలు కలిపించుకుంటుంది. ఆమద్య కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు కూడా మేనల్లుడిని తీసుకు వెళ్లింది. పిల్లలు అంటే ఇంత ఇష్టపడే మల్లికాను ఎవరైనా మీరు పిల్లలు ఎప్పుడు కంటారంటూ ప్రశ్నిస్తే ఆమె సమాధానం వింతగా ఇస్తోంది.నాకు నా మేనల్లుడు రాన్షెర్ అంటే చాలా ఇష్టం. వాడితో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడతాను. వాడితో జర్నీ చేయడం కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాను. నాకంటూ సొంత బిడ్డ లేడు కనుక వాడే నా సొంత బిడ్డ అనుకుంటాను. నాకు పిల్లలను కని వారి బాధ్యత తీసుకోవాలంటే మాత్రం నా వల్ల కాదు. పిల్లలను కనడం వారి గురించి ఎక్కువ సమయం కేటాయించడం అంటే నాకు సాధ్యం అయ్యే పని కాదు. అసలు పిల్లల బాధ్యత తీసుకోవాలంటే నాకు భయం. సంతానం ఉంటే వారికే పూర్తి సమయం కేటాయించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం తాను సింగిల్ గా ఉన్నాను. కాని ప్రేమలో ఉండాలని నాకు ఉంది. రొమాన్స్ చాలా గొప్పది. ఎవరితోనైనా రిలేషన్ లో ఉంటే అది మనలో ఉత్తేజాన్ని నింపుతుందంది. ఇక ఇండియాలో సింగల్ గా ఉండే నటీనటులకు విమర్శలు తప్పవు. రేఖ గారి నుండి ఇప్పటి వరకు ఎంతో మంది విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. నేను వాటన్నింటి గురించి పట్టించుకోనంటూ మల్లికా షెరావత్ చెప్పుకొచ్చింది.