మల్లిక కొత్తగా ఏదో చూపిస్తోంది

Thu Dec 03 2015 21:00:01 GMT+0530 (IST)

Mallika Sherawat puts Flat Tummy on Display

ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు అని కొన్ని ఉంటాయి. అలాగే ట్రెండ్ సెట్టింగ్ హీరోయిన్లు కూడా కొందరుంటారు. ఇలా బాలీవుడ్లో ట్రెండ్ సెట్ చేసిన సినిమా మర్డర్ అయితే.. అదే సినిమాలో నటించిన మల్లికా శరారత్ ట్రెండ్ సెట్ చేసిన హీరోయిన్ అయింది. అందులో ఆమె చేసిన ఇంటిమేట్ సీన్లు.. ఆమె చూపించిన క్లీవేజ్ షోలు.. అప్పటిదాకా ఇండియన్ సినిమాలో ఎప్పుడూ చూసింది లేదు. ఆ తర్వాత కూడా మల్లిక నటించిన సినిమాలేవీ కూడా ‘ఎ’ రేటింగ్ నుంచి తప్పించుకోలేదు. ఆ స్థాయిలో ఇండియన్ స్క్రీన్ గ్లామర్ పూత పూసింది మల్లిక.ఐతే ఇండియన్ ఆడియన్స్ కు అంతగా గ్లామర్ సేవ చేసిన మల్లికను ఈ మధ్య ఎవరూ పట్టించుకోవట్లేదు. అవకాశాలివ్వట్లేదు. దీంతో బాగా ఫీలైనట్లుంది మల్లిక. తనలో ఏదైనా లోపం ఉందేమో అనుకుని జిమ్ముకెళ్లి కొవ్వు కరిగించే పనిలో పడిందామె. అలా వర్కవుట్ చేసి.. నా నడుం ఎంత తగ్గిందో చూశారా అంటూ ఓ పిక్ ట్విట్టర్లో షేర్ చేసింది మల్లిక. ఇలా సన్నబడ్డ నడుం చూసుకుంటే మరింత వర్కవుట్ చేయడానికి స్ఫూర్తిగా ఉంటుంది అంటోంది మల్లిక. మరి ఈ నాజూకు నడుం అయినా మల్లికకు అవకాశాలు ఇప్పిస్తుందేమో చూడాలి.