వీరాభిమానికి రీట్వీట్ తో 'ట్రీట్' ఇచ్చిన మాస్టర్ బ్యూటీ!!

Wed Aug 05 2020 15:40:49 GMT+0530 (IST)

Malavika gave a reply and gave a treat to the fan

మాళవిక మోహనన్.. ఈ పేరు మొన్నటి వరకు సినీ ప్రేక్షకులకు.. సౌత్ ఇండస్ట్రీకి కూడా పెద్దగా పరిచయం లేదు. అలాంటిది ఒక్కసారిగా సోషల్ మీడియాలో అమ్మడి గురించి చర్చ మొదలైందంటే మ్యాటర్ కాస్తా ఇంపార్టెంట్ అన్పిస్తుంది కదా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్ కూతురే ఈ మాళవిక మోహనన్. మరి సడన్ గా వైరల్ ఎందుకయ్యింది.. అంటే తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటిస్తున్న "మాస్టర్" సినిమా పోస్టర్ రిలీజ్ అయినప్పటి మాళవిక ఒక ఊపు ఊపేస్తుంది. ఇటీవలే మాస్టర్ సినిమా టీం విజయ్ తో మాళవిక ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేసింది. అప్పటివరకు ఎవరికీ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో పెద్దగా క్లారిటీ లేదు. ఒక్కసారిగా దళపతి విజయ్ పక్కన కనపడే సరికి అందరి కళ్ళు ఈమె మీదే పడ్డాయి. అప్పటి నుండి ఈమె ఎవరో కనుక్కోవడానికి సోషల్ మీడియా అంతా వెతకడం మొదలుపెట్టారు. మాళవిక ఒక్క పోస్టర్ తో సినీ అభిమానులను తన వైపు తిప్పుకుంది.మాళవిక తాజాగా సోషల్ మీడియాలో మరోసారి హల్చల్ చేస్తోంది. అమ్మడికి సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో బాగా తెలుసు. ముఖ్యంగా అభిమానులతో ఎలా ఉండాలో బాగానే తెలుసుకుంది. అందుకే ఇటీవలే ట్విట్టర్ వేదికగా ఓ అభిమానికి ఊహించని ట్రీట్ ఇచ్చింది. అమ్మడు ఆ అభిమానికి ఇచ్చిన రిప్లై చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే. ట్విట్టర్ లో ఓ అభిమాని మాళవికను ట్యాగ్ చేసి నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్. పుట్టినరోజు సందర్భంగా ఒక ఉమ్మా ట్రీట్ ఇవ్వగలరా..? అని అడిగాడు. దానికి మాళవిక స్పందించి ఉమ్మా అని రిప్లై ఇచ్చి అభిమానికి ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం మాళవిక ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కానీ అభిమానుల మనసు దోచుకుంది ఈ బ్యూటీ. ఇటీవలే తెలుగులో విజయ్ దేవరకొండతో ఓ సినిమా ప్లాన్ చేశారు. కానీ ఆ మూవీ కాస్త పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. ఇక వీరాభిమానికి ఉమ్మా ట్వీట్ ఇవ్వడంతో నెట్టింట అమ్మడు పేరు తెగ వైరల్ అవుతోంది.