కిల్లర్ లుక్ తో లాయర్ మాళవిక మ్యాజిక్

Tue May 04 2021 16:00:02 GMT+0530 (IST)

Malavika Sharma Latest Stunning Pose

కిల్లర్ లుక్ తో కిల్ చేస్తోంది.. కుర్రాళ్ల గుండెల్ని స్ట్రైకర్ లా తాకుతోంది. ఎవరీ భామ? అంటే.. నేల టిక్కెట్ బ్యూటీ మాళవిక శర్మ. ఇటీవలే రామ్ సరసన రెడ్ చిత్రంలో నటించింది. కానీ ఆ రెండు సినిమాలతో తాను ఆశించిన సక్సెస్ ని దక్కించుకోవడంలో తడబడింది. రవితేజ- రామ్ లాంటి హీరోలు తనకు హిట్టివ్వలేకపోయారు.అయినా కానీ మాళవికలో సంథింగ్ ఏదో ఉందని పరిశ్రమ నమ్ముతోంది. ఈ అమ్మడికి మునుముందు మంచి అవకాశాలు దక్కనున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ హైకోర్టులో జూనియర్ లాయర్ గా మాళవిక ప్రాక్టీస్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఓవైపు క్రిమినల్ సైకాలజీలో డిగ్రీ సాధించిన మాళవిక.. లాయర్ గానూ వృత్తిని కొనసాగించాలని పంతంతో ఉంది. మరోవైపు నటిగా కెరీర్ ని బ్యాలెన్స్ చేయాలని ప్రయత్నిస్తోంది.

సోషల్ మీడియాల్లో వరుస ఫోటోషూట్లతో మాళవిక అన్ లిమిటెడ్ ట్రీట్ అంతే హీట్ పెంచేస్తోంది. తాజాగా మాళవిక కిల్లర్ లుక్ అభిమానుల్లో వైరల్ గా మారింది. బ్లూ- టైట్ ఫిట్ డిజైనర్ ఫ్రాకులో మాళవిక స్ట్రైకింగ్ లుక్ దూసుకెళుతోంది. అభిమానులు ఈ ఫోటోని అంతర్జాలంలో వైరల్ చేస్తున్నారు.