బటన్ లెస్ లో అందాల ఎర.. ఎవరీమె?

Sat Sep 21 2019 13:28:44 GMT+0530 (IST)

Malavika Sharma Glamourous Pose

కాలంతో పాటే పరుగు. పోటీ ప్రపంచంలో వేగం అందుకోలేకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. ఈ రాకెట్ స్పీడ్ యుగంలో అందరితో సమానంగా ముందుకు వెళ్లాలంటే కాలంతో పాటు మనమూ మారాల్సిందే అంటోంది `నేల టిక్కెట్టు` పాప మాళవికా శర్మ.రవితేజ హీరోగా కల్యాణ్‌కృష్ణ కురసాల రూపొందించిన `నేలటిక్కెట్టు` చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ఈ చిన్నది న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకుని ముంబై పరిశ్రమలో గట్టిగానే ట్రై చేసింది. కానీ పనవ్వలేదు. తెలుగులో తొలి ప్రయత్నంగా నేల టిక్కెట్టు అట్టర్ ఫ్లాప్. దీంతో ఇక్కడా పెద్దగా అవకాశాలు రావడం లేదు. అందుకే.. అందివచ్చిన టీవీ కమర్షియల్స్ లో నటిస్తూనే సోషల్ మీడియాలు ట్విట్టర్-ఇన్ స్టాల్లో హాట్ హాట్ ఫొటోలతో హల్‌చల్ చేస్తోంది. తాజాగా బ్లాక్ అండ్ వైట్ ఫోటోషూట్ తో మాళవిక గుబులు పెంచే ప్రయత్నంలో ఉంది.

``ప్రతిదీ మారుతోంది. దానికి అనుగుణంగా నేనూ మారుతున్నా.. బెటర్ మెంట్ అయ్యాను`` అంటూ మాళివిక శర్మ ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఆ అందాల విరజాజి కురుల్ని విరబోసి వైట్ కలర్ టాప్ కి బటన్స్ వదిలేసి మత్తుగా గమ్మత్తయిన అందాలతో వలలు విసురుతోంది.  బటన్ లెస్ లో బిగువల బంధనాల్ని తొలగించి బ్లాక్ అండ్ వైట్ మోడ్ లో మాళవిక కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోపై నెటిజనులు అంతే ఇదిగా స్పందిస్తున్నారు. స్టాప్ యువర్ కిల్లింగ్ పిక్స్.. ఇన్‌స్టా ఫైరింగ్! అంటూ కామెంట్లతో చెలరేగుతున్నారు. ఇప్పటికైనా మాళవిక టాలెంట్ ని గుర్చించి టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆమెకు వరుస అవకాశాలిస్తేనే కాస్తాయినా ఈ సెగ తగ్గుతుందేమో!!