ఫోటో స్టొరీ: స్టన్నింగ్ ఓనం ట్రీట్

Sun Sep 15 2019 13:31:25 GMT+0530 (IST)

Malavika Sharma Glamourous Pose

మాళవిక మోహనన్ తెలుగు ప్రేక్షకులకు తెలిసి ఉండక పోవచ్చు కానీ త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.  విజయ్ దేవరకొండ కొత్త సినిమా 'హీరో' తో పరిచయం అవుతోంది.  ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యూ. మోహనన్ కుమార్తె అయిన మాళవిక మలయాళం సినిమాలు మాత్రమే కాదు.. తమిళ..కన్నడ.. హిందీ సినిమాల్లో కూడా నటించింది.  ఈ భామ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే ఈ జెనరేషన్ అమ్మాయి.కేరళ భామ కదా.. అందుకే రీసెంట్ గా ఓనం పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంది. కేరళ ట్రేడ్ మార్క్ కలర్ లాంటి హాఫ్ వైట్ శారీ ధరించి ముచ్చటైన పోజులిచ్చింది.  ఒక ఫోటోలో దోసిలితో పూలను పట్టుకొని చిరునవ్వులు చిందిస్తూ సూపర్ పోజిచ్చింది.  మరో ఫోటోలో జడ సవరించుకుంటున్నట్టుగా పోజిచ్చింది.  దీంతో ఖుషి ఇంటర్వెల్ ఎపిసోడ్ ను మాళవిక గుర్తు తెస్తోంది.  మగ మనిషిగా జన్మ ఎత్తిన వాడు ఆ ఫోటోలో ఎక్కడ చూడాలి? ఎవరైనా ఖుషిలో పవన్ కళ్యాణ్ తరహాలో అక్కడే చూస్తారు! దాని సంగతేమో కానీ ఈ ఫోటో మాత్రం ఒక పెయింటింగ్ లాగా కనిపిస్తోంది.  

ఈ ఫోటోలకు నెటిజన్ల నుండి సూపర్ స్పందన దక్కింది. అయితే మన టైం బ్యాడ్.. ఎక్కువమంది మలయాళం భాషలో తమ స్పందనలు తెలిపారు. ఒక్క అక్షరం అర్థమైతే ఒట్టు. అయితే మనకు ఎక్కువగా.. సులభంగా అర్థం అయ్యే ఇంగ్లీష్ భాష స్పందనలు కూడా ఉన్నాయి. "ఉఫ్..కట్టింగ్ ఎడ్జ్".. "స్టన్నింగ్ ఓనం ట్రీట్".. "అందుకే నాకు కేరళ ఇష్టం" అంటూ స్పందించారు. ఒకరు మాత్రం "కెఎల్ రాహుల్ తో జాగ్రత్త" అన్నారు. మరి అలాంటి సూచన ఎందుకిచ్చాడో ఏంటో!