Begin typing your search above and press return to search.

పులి కళ్ల‌లో క‌ళ్లు పెట్టి చూసిన డేరింగ్ హీరోయిన్

By:  Tupaki Desk   |   6 March 2021 7:59 AM GMT
పులి కళ్ల‌లో క‌ళ్లు పెట్టి చూసిన డేరింగ్ హీరోయిన్
X
పులులు స‌మీపంలోనే సంచ‌రిస్తున్నా భ‌య‌ప‌డ‌ని ఆ హీరోయిన్ ఎవ‌రు? అక్క‌డ ఏమాత్రం జంకు అన్న‌దే లేకుండా స్వేచ్ఛా విహారం చేస్తోంది. చూస్తుంటే... పులి కంట్లో క‌ళ్లు పెట్టి చూసేందుకైనా వెన‌కాడ‌నంత‌ డేరింగ్ గా క‌నిపిస్తోంది. ఇంత‌కీ ఎవ‌రా రెబ‌ల్ హీరోయిన్ అంటారా?

ఇంకెవ‌రు మాళ‌విక మోహ‌న‌న్. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ మోహ‌న‌న్ కుమార్తె. త‌మిళంలో స్టార్ హీరోయిన్ గా స్టార్ డ‌మ్ ని ఆస్వాధిస్తోంది. ఇంత‌కుముందు ర‌జ‌నీకాంత్ పేట‌- విజ‌య్ మాస్ట‌ర్ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మైన ఈ భామ ప్ర‌స్తుతం మ‌రో త‌మిళ సూప‌ర్ స్టార్ ధ‌నుష్ స‌ర‌స‌న న‌టిస్తోంది.

త‌దుప‌రి టాలీవుడ్ స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించాల‌న్న‌ది ఈ భామ డ్రీమ్. కానీ అందుకు ఇంకా టైమ్ రాలేదు. మోహ‌న‌న్ కుమార్తెగా మాళ‌విక కు టాలీవుడ్ కాంటాక్టుల ప‌రంగా ఇబ్బందేమీ లేదు. కానీ స‌రైన ఆఫ‌ర్ కోస‌మే వెయిటింగ్ అని తెలిసింది. అన్న‌ట్టు మాళ‌విక ఇన్ స్టా ఇటీవ‌ల వేడెక్కించే ఫోటోషూట్ల‌తో నిండిపోతోంది. కానీ దానికి భిన్న‌మైన ఫోటోని ఈరోజు మాళ‌విక అభిమానుల కోసం షేర్ చేసింది.

ఒక డీప్ ఫారెస్ట్ కి వెళ్లిన మాళ‌విక అక్క‌డ వైల్డ్ లైఫ్ ఫోటోగ్ర‌ఫీని ఆస్వాధిస్తోంది. ఈ మ‌ల‌యాళీ అమ్మాయి ఎంతో డేరింగ్ గా అడ‌విలో విహ‌రిస్తోంది. ఇలా పులికి ద‌గ్గ‌ర‌గా వెళుతూ కూడా ఎంతో ధైర్యంగా క‌నిపిస్తోంది. ఈ ఫోటోని షేర్ చేసిన మాళ‌విక .. ఇంత‌కంటే ఉద‌యాన్ని ఘ‌నంగా ప్రారంభించ‌లేం.. ఇదే బెస్ట్ వే! అన్న క్యాప్ష‌న్ ఇచ్చింది. అది సరే కానీ.. అస‌లే బెంగాళ్ టైగ‌ర్.. జాగ్ర‌త్త‌! అంటూ అభిమానులు అలెర్ట్ చేస్తున్నా అదేమీ ప‌ట్టించుకుంటున్న‌ట్టు లేదు! ఇక ఈ లుక్ లో మాళ‌విక ఎంతో స్పెష‌ల్ గానూ క‌నిపిస్తోంది. ల‌ఘు చిత్రాల‌తో అవార్డులు కొల్ల‌గొట్టిన యువ ద‌ర్శ‌కుడు కార్తీక్ న‌రేన్ తో ప్ర‌స్తుతం ఒక క్రేజీ సినిమా చేయ‌డానికి మాళ‌విక మోహ‌న‌న్ సంత‌కం చేసింది.