ప్రభాస్ కోసం డైరెక్టర్ హీరోయిన్ వెయిటింగ్!

Wed May 25 2022 08:00:01 GMT+0530 (IST)

Malavika Mohanan Waiting For Prabhas Movie

రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత ఎలాగైనా మళ్లీ అదే తరహాలో సక్సెస్ రేట్ ను పెంచుకోవాలి అని అనుకున్నాడు. కానీ అందుకు భిన్నంగా సాహో సినిమా పర్వాలేదు అనిపించినప్పటికీ రాధే శ్యామ్ సినిమా దెబ్బ కొట్టేసింది. ఆ సినిమా దాదాపు వంద కోట్ల నష్టాలను మిగిల్చినట్లు టాక్ అయితే వచ్చింది. అయితే తదుపరి ప్రాజెక్టుల విషయంలో మాత్రం ప్రభాస్ ఎలాంటి రిస్క్ లేకుండా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకునెందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.మొత్తానికి ప్రభాస్ ఆదిపురుష్ సినిమా షూటింగ్ అయితే పూర్తి చేశాడు. ఇక ఆ తర్వాత సలార్ సినిమాను కూడా పూర్తి చేయాల్సిన టార్గెట్ అయితే ముందుంది. సలార్ సినిమాకు పెద్దగా సమయం పట్టకపోవచ్చు కానీ ఈ ప్రాజెక్టు విషయంలో మాత్రం ప్రభాస్ కాస్త ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాజెక్టు కోసం భారీ స్థాయిలో ఖర్చు పెడుతున్న విషయం తెలిసిందే.

అయితే ఈ రెండు ప్రాజెక్టుల మధ్యలోనే ప్రభాస్ వీలైనంత తొందరగా మారుతి దర్శకత్వంలో మరో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఆ ప్రాజెక్టు కోసం కేవలం రెండు నెలల డేట్స్ మాత్రమే అడ్జస్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది దర్శకుడు మారుతి ఎంత టాలెంట్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సింపుల్ కథను సెలెక్ట్ చేసుకొని ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందికాచాలని చాలా తొందరగా సినిమా షూటింగ్ పూర్తి చేస్తూ ఉంటాడు. ప్రభాస్ కోసం హారర్ కాన్సెప్ట్ కథను సెట్ చేసినట్లు టాక్.

ఇక ఈ సినిమా కోసం ఇప్పటికే ఒక భారీ సెట్ ను కూడా నిర్మించినట్లు తెలుస్తోంది. ఒక బంగ్లా లోనే ఆ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ సినిమాకు రాజా డీలక్స్ టైటిల్ కూడా అనుకుంటున్నారు. అంతేకాకుండా గ్లామరస్ హీరోయిన్ మాళవిక మోహనన్ కూడా ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది.

అయితే ప్రభాస్ కోసం ఈ ఇద్దరు కూడా మరొక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకో కుండా ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి అని ఈ ఇద్దరు ఇతర సినిమాలతో డేట్స్ క్లాష్ అవ్వకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ముఖ్యంగా మాళవికా మోహనన్ తదుపరి సినిమాను ప్రభాస్ తోనే చేయాలి అనే ఆమె  తెలుగు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదని సమాచారం. మరి ప్రభాస్ ఎప్పుడో ఈ ప్రాజెక్టు ను స్టార్ట్ చేస్తాడో చూడాలి.