Begin typing your search above and press return to search.

చిమ్మ చీక‌ట్లో మాళ‌విక వెలుగు జిలుగులు

By:  Tupaki Desk   |   15 May 2022 3:30 PM GMT
చిమ్మ చీక‌ట్లో మాళ‌విక వెలుగు జిలుగులు
X
కేర‌ళ కుట్టీ మాళ‌విక మోహ‌న‌న్ మాలీవుడ్..బాలీవుడ్ కే ప‌రిమితం. ఇంకా టాలీవుడ్ లో లాంచ్ అవ్వ‌లేదు. అదిగో పులి ఇదిగో తో అన్న ప్ర‌చారం త‌ప్ప అమ్మ‌డు ఎంట్రీ ఇంకా ఖ‌రారు కాలేదు. అయినా గ్లామ‌ర్ గేట్లు మాత్రం ఎప్పుడో తెరిచేసింది. సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడల్లా చిచ్చ‌ర పిడుగులా చెల‌రేగుతుంది. క్లీవేజ్ అందాల‌తో...థైషోస్ తో యువ‌త‌ని ఆక‌ర్షిస్తుంది.

ఇన్ స్టాలో హాట్ టాపిక్ అవుతుంది. ఏ సౌత్ హీరోయిన్ ఆరబోయ‌ని రేంజ్ లో అందాలు విందు చేస్తుంది. ఇటీవ‌లే ఓ హాట్ ఫోజుతో ఇన్ స్టాని షేక్ చేసిన బ్యూటీ మ‌రోసారి స్కిన్ షోతో ఆక‌ట్టుకుంది. చిమ్మ‌చీకట్లో మిరుమిట్లు గొలిపే స్కిన్ టోన్ తో జిగేల్ అనిపించింది. ఆకుప‌చ్చ డిజైన‌ర్ ఔట్ ఫిట్ లో చీక‌టిలో వెలుగులు విర‌జిమ్మింది.

చేతిలో హ్యాండ్ బ్యాగ్ మ‌రింత షైనింగ్ అవుతుంది. పార్కింగ్ సెల్లార్ లో స్పాట్ లైట్ న‌డుమ ఇచ్చిన‌ ఫోజులిప్పుడు ఇన్ స్టా యువ‌త‌ని ఊపేస్తున్నాయి. ఈ ఫోటోని ఉద్దేశించి `బిగ్ హ‌గ్ టూ మై ఫ్యావ‌రెట్ బోయ్స్` అని రాసుకొచ్చింది. నిన్న‌టి రాత్రిపూట ఈ ఫోటోని క్యాప్చ‌ర్ చేసారు.

మాళ‌విక మోహ‌న‌న్ `కోహీనూర్` అనే మాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అటుపై క‌న్న‌డ‌..హిందీ భాష‌ల్లో కొన్ని సినిమాలు చేసింది. త్వ‌ర‌లో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న `డీల‌క్స్ రాజా` సినిమాలో హీరోయిన్ గా మాళ‌వికని ఎంపిక చేసిన‌ట్లు ప్రచారం సాగుతుంది. అదే నిజ‌మైతే టాలీవుడ్ లో మాళ‌విక డెబ్యూ మూవీ ఇదే అవుతుంది.

ప్ర‌స్తుతం మాళ‌విక బాలీవుడ్ లో `యుద్ర` అనే సినిమాలో న‌టిస్తోంది. ఈ ఛాన్స్ త‌ప్ప కొత్త ప్రాజెక్ట్ లు ఏవి చేతిలో లేవు. బాల‌వుడ్ లో అవ‌కాశాల కోసం సీరియ‌స్ గానే ప్ర‌య‌త్నాలు చేస్తుంది. కానీ ఆ టైమ్ ఇంకా రాలేదు. ఈలోపు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చే అవ‌కాశాలు ఎక్కువగా క‌నిపిస్తున్నాయి. ఇటీవ‌లి కాలంలో టాలీవుడ్ మేక‌ర్స్ మ‌ల‌యాళం బ్యూటీల‌కు ఎర్ర తివాచీ వేసి మ‌రీ ఆహ్వానిస్తోన్న సంగ‌తి తెలిసిందే.