మాళవిక క్లీవేజ్ కుర్రకారులో కాక!

Wed May 25 2022 14:00:01 GMT+0530 (IST)

Malavika Mohanan Latest Insta Pic

జూనియర్ భామలు అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకాడటం లేదు. భాషాబేధం లేకుండా  అందాలతో ఊపేస్తున్నారు. ప్రస్తుతం ఆ ట్రెండులోనే సక్సెస్ అవుతోంది మలయాళీ వయ్యారి మాళవిక మోహనన్. పాపులర్ సినిమాటోగ్రాఫర్ మోహనన్ కుమార్తెగా ఎంట్రీ ఇచ్చిన మాళవిక.. సోషల్ మీడియా మొత్తం తన అందాలతో షేక్ చేస్తోంది.ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. గతేడాది వరకు పలు సినిమాలు చేసినా అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు. మొదట్లో చీరకట్టుతో మెప్పించిన మాళవిక ఇప్పుడు కళ్లు చెదిరే రీతిలో అందాలు ఆరబోస్తుంది. సందర్భం వచ్చినప్పుడల్లా చిచ్చర పిడుగులా చెలరేగుతుంది. క్లీవేజ్ అందాలతో...థైషోస్ తో యువతని ఆకర్షిస్తుంది.

ఇన్ స్టాలో హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా మాళవిక మరోసారి యువత అటెన్షన్ డ్రా చేసిన స్నాప్ తో ముందుకొచ్చేసింది. బ్లాక్ కలర్ డిజైనర్ దుస్తుల్లో క్లీవేజ్ సెగలతో కాకలు పుట్టిస్తుంది. కాలు మీద కాలేసుకుని మత్తెక్కించే చూపులతో యువత హృదయాల్ని కొల్లగొడుతుంది. ఇందులో అమ్మడి హెయిర్ లైన్ ఆకర్షణీయంగా ఉంది.

పొడవైన అందమైన జుట్టుతో సమ్ థింగ్ స్పెషల్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. నటిగా బిజీ కాకముందే యువతలో మంచి ఫాలోయింగ్ తో క్రేజీ బ్యూటీగా పాపులర్ అవుతుంది. యూత్ అటెన్షన్ మాత్రమే టార్గెట్ గా కొత్త కొత్త ఫోటోలతో అగ్గిరాజేస్తుంది.

మాళవిక మోహనన్ `కోహీనూర్` అనే మాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అటుపై కన్నడ..హిందీ భాషల్లో కొన్ని సినిమాలు చేసింది.  త్వరలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న 'డీలక్స్ రాజా' సినిమాలో హీరోయిన్ గా మాళవికని ఎంపిక చేసినట్లు ప్రచారం సాగుతుంది. అదే నిజమైతే టాలీవుడ్ లో మాళవిక డెబ్యూ మూవీ ఇదే అవుతుంది.

ప్రస్తుతం మాళవిక బాలీవుడ్ లో'యుద్ర' అనే సినిమాలో నటిస్తోంది.  ఈ ఛాన్స్ తప్ప కొత్త ప్రాజెక్ట్ లు ఏవి చేతిలో లేవు. బాలీవుడ్ లో అవకాశాల  కోసం సీరియస్ గానే ప్రయత్నాలు చేస్తుంది.  కానీ ఆ టైమ్ ఇంకా రాలేదు. ఈలోపు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశాలు  ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో టాలీవుడ్ మేకర్స్ మలయాళం బ్యూటీలకు ఎర్ర తివాచీ వేసి మరీ ఆహ్వానిస్తోన్న సంగతి తెలిసిందే.