ఫోటో స్టోరీ: ముంబై ని వేడెక్కించిన కేరళ భామ

Fri Dec 06 2019 10:52:27 GMT+0530 (IST)

Malavika Mohanan At Filmfare Glamour And Stylish Awards

మలయాళ భామ మాళవిక  మోహనన్ పేరు వినే ఉంటారు. తెలుగులో ఈ భామ నటించలేదు. మొదటిసారిగా విజయ్ దేవరకొండ 'హీరో' లో హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళం..కన్నడ.. తమిళం.. హిందీ భాషలను కవర్ చేసిన ఈ భామ హాట్ నెస్ అనే పదానికి కేరాఫ్ అడ్రెస్. ఈమధ్య ముంబై లో జరిగిన ఫిలింఫేర్ గ్లామర్ & స్టైల్ అవార్డ్స్ కార్యక్రమానికి హాజరైంది. ఇక చూసుకోండి తనలోని గ్లామర్ మొత్తాన్ని బయటకు తీసి సౌత్ భామల సత్తా ఏంటో చాటింది.ఫిలింఫేర్ గ్లామర్ ఆవార్డ్స్ ఈవెంట్ నుంచి కొన్ని ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ ఫోటోలు చూసిన ఎవరైనా మాళవిక గ్లామర్ ట్రీట్.. ఆ హాట్ నెస్.. స్టైల్ అన్నిటికి ఫిదా కావడం ఖాయం. ముంబై భామలకు గ్లామర్ విషయంలో సరైన పోటీ ఇచ్చినట్టుగా ఉంది. మెరుస్తూ ఉండే శాటిన్ కోటు.. ప్యాంట్ ధరించి.. ఒక స్పెషల్ డిజైన్ ఉండే ఇన్నర్ వేర్ తో దిశా పటానికి దక్షిణాది కజిన్ తరహాలో అంతః సౌందర్యాన్ని బాహ్య ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఆ చెవి రింగులు.. జేబులో చేతిని పెట్టుకున్న స్టైల్ చూస్తే ఈ భామ ను ఏ మెక్సికన్ పాప్ సింగరో అని అనుకుంటారు కానీ కేరళ భామ అనుకునే సమస్యే లేదు.

ఈ ఫోటోలకు నెటిజన్ల రసహృదయాలు ద్రవించాయి.. అవే కామెంట్ల రూపం లో బయటకు వచ్చాయి. "నీ అందంతో నేను చచ్చిపోయాను.. నువ్వే నన్ను చంపావు".. "మరీ ఇంత హాటా?".. "అల్ట్రా స్టైలిష్" అంటూ వారి స్పందనలు తెలిపారు. ఇక మాళవిక  సినిమాల విషయానికి వస్తే తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త సినిమాలో నటిస్తోంది.