కరణ్ పార్టీలో కాకలు పుట్టించిన మలైకా

Thu May 26 2022 08:38:07 GMT+0530 (IST)

Malaika At Karan Birthday party

పార్టీ ఏదైనా దుమ్ము దులిపేయడం మలైకా అరోరా స్టైల్. తాజాగా ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ పుట్టినరోజు వేడుకల్లో మలైకా ఎంట్రీ కాకలు పుట్టించింది. నెటిజనుల్లో తీవ్రమైన ట్రోలింగ్ కి కారణమైంది. ఇంతకీ మలైకా ఎంట్రీ ఎలా ఉంది? అన్నది తెలియాలంటే ఇది చదవాల్సిందే.పార్టీ గాళ్ మలైకా కరణ్ ఈవెంట్ కి ఊహాతీతమైన డ్రెస్ లో దిగిపోవడం సర్వత్రా వేడి పుట్టించింది. గ్రీన్ కలర్ షిమ్మరీ జాకెట్ ని ధరించిన మలైకా ఇన్నర్ అందాలను ఆరబోస్తూ హొయలు పోయిన తీరు పార్టీ క్రౌడ్ లో చర్చనీయాంశమైంది. మలైకా తన ఇన్నర్ ధరించిన తీరుపై నెటిజనులు దారుణమైన ట్రోలింగ్ చేస్తున్నారు. మలైకా తీరైన తన ఆబ్స్ను ఆవిష్కరిస్తూ శాటిన్ కమర్ బ్రాలెట్ లో కనిపించింది. దీనికి ఒక పొట్టి షార్ట్ కాంబినేషన్ ని ధరించడంతో పార్టీ వీక్షకుల్లో హీట్ రాజుకుంది.

మలైకా అరోరా డేరింగ్ లుక్ తో ఇలా ప్రత్యక్షమవ్వడం ఇప్పుడే కొత్తేమీ కాదు. కాబట్టి కరణ్ జోహార్ పుట్టినరోజు పార్టీకి వెళ్ళినప్పుడు ఇలాంటి బోల్డెస్ట్ లుక్ తో కనిపించడంపై ఆశ్చర్యపోనవసరం లేదు. బుధవారం రాత్రి ఈవెంట్ ఆద్యంతం కళ్లన్నీ మలైకాపైనే తిప్పుకోవడానికి కారణం ఆ డ్రెస్ ఎంపికేనన్నది నిస్సందేహం.

మలైకా బోల్డెస్ట్ సొగసును ఆవిష్కరించేందుకు పార్టీలో ఏమాత్రం బిడియపడలేదు. నియాన్ గ్రీన్ కాటన్ .. సిల్క్-బ్లెండ్ కార్ల్ టన్ బ్లేజర్ తో నైట్ పార్టీలో మెరిసిపోయింది. అలెక్స్ పెర్రీ స్ప్రింగ్ సమ్మర్ 2022 బ్రాండ్ దుస్తులు ఇవి అని తెలుస్తోంది.  అయితే మలైకా ఫ్యాషన్ పై ఒక వర్గం నుంచి విమర్శలు కూడా వెల్లువెత్తాయి. నెటిజన్లు కొందరు ఈ దుస్తుల ఎంపిక పేలవంగా ఉందని విమర్శించారు.. ఒక వినియోగదారు ఇలా రాశారు..ఓవర్ రేట్ చేయబడింది.. అని మరొకరు"డ్రెస్సింగ్ సెన్స్ పూర్తిగా థర్డ్ క్లాస్" అని వ్యాఖ్యానించారు.

మలైకా ఇటీవల మహిళలు ధరించే దుస్తులకు ఎలా తీర్పు ఇస్తారంటూ నెటిజనులపై విరుచుకుపడిన తర్వాత ఇప్పుడిలా తిరిగి ఎదురుదాడి కొనసాగించారు. అనవసరమైన అభిప్రాయాలు తన డ్రెస్సింగ్ సెన్సిబిలిటీని మార్చడానికి తాను అనుమతించబోనని మలైకా చెప్పింది. ప్రజలు చెప్పే దాని ప్రకారం నేను నా జీవితాన్ని గడపలేను. డ్రెస్సింగ్ అనేది చాలా వ్యక్తిగత ఎంపిక. మీరు ఒక నిర్దిష్ట మార్గంలో ఆలోచించవచ్చు కానీ అది నా కోసం కాకపోవచ్చు.

నేను దానికి ఎవరినీ నిందించలేను అని కూడా మలైకా ఓపెన్ గా మాట్లాడారు. నా వ్యక్తిగత ఎంపికలు నా ఇష్టం అని మలైకా అన్నారు. నన్ను తీర్పు చెప్పమంటే.. "ఓహ్.. మీరు ఎందుకు నిర్దిష్టంగా అలాంటి దుస్తులు ధరిస్తున్నారు? అన్నది నేను చెప్పలేను" అని మలైకా వ్యాఖ్యానించారు. మలైకా ప్రస్తుతం పలు రియాలిటీ షోలు ఫ్యాషన్ షోలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.