ముద్దు ముచ్చట్ల వరకేనా.. పెళ్లి లేదా?

Mon Jan 20 2020 14:24:48 GMT+0530 (IST)

Malaika Arora shares her vacay images!!

బాలీవుడ్ లో ఈమద్య ప్రేమ పెళ్లిలు చాలా జరుగుతున్నాయి. హీరోయిన్స్ ను క్రికెటర్లు ప్రేమించి పెళ్లి చేసుకోవడం.. హీరో మరియు హీరోయిన్స్ ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు కొత్తేం కాదు. గతంతో పోల్చితే ఇప్పుడు ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా పెళ్లికి దారి తీస్తున్నాయి. అయితే మలైకా అరోరా మరియు అర్జున్ కపూర్ ల ప్రేమ బంధం మాత్రం పెళ్లి వరకు వెళ్లే అవకాశం కనిపించడం లేదు.వీరిద్దరు గత నాలుగు అయిదు సంవత్సరాలుగా సన్నిహితంగా ఉంటున్నారు. మలైకా అరోరాకు అర్భాజ్ ఖాన్ కు విడాకులు అధికారికంగా వచ్చిన తర్వాత వ్యవహారం ముదిరింది. అర్భాజ్ ఖాన్ కు విడాకులు ఇవ్వడానికి కారణం అర్జున్ కపూర్ అంటూ ఆమద్య ప్రచారం జరిగింది. ఎప్పుడైతే అర్భాజ్ ఖాన్ నుండి విడాకులు వచ్చాయో వెంటనే అర్జున్ కపూర్ ను ఈమె పెళ్లి చేసుకుంటుందని అంతా భావించారు. కాని వీరిద్దరు బాహాటంగా ప్రేమించుకోవడం మొదలు పెట్టారు కాని పెళ్లి విషయంలో మాత్రం మీన మేషాలు లెక్కిస్తున్నారు.

ప్రస్తుతం మొరాకోలో ఈ జంట విహరిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలోనే మొరాకో వెళ్లిన వీరు మళ్లీ ఇప్పుడు మొరాకాలో సందడి చేస్తున్నారు. వీరిద్దరి జోడీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రేమలో మునిగి తేలుతున్న వీరిద్దరు పెళ్లి విషయం వచ్చేప్పటికి సైలెంట్ అవుతున్నారు. ప్రేమ వ్యవహారంను మొదట్లో రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నించిన మలైకా కొన్నాళ్లుగా మొత్తం ఓపెన్ అయ్యింది. అర్జున్ కు ముద్దులు పెడుతూ ఫొటోలు దిగి వాటిని పోస్ట్ చేస్తుంది. ముద్దు ముచ్చట్ల వరకేనా పెళ్లి లేదా అంటూ నెటిజన్స్ వారిని ప్రశ్నిస్తున్నారు.