Begin typing your search above and press return to search.

11ఏళ్లు చిన్నోడే కానీ క‌న్న‌య్య ఆ ప‌నిలో మ‌హా గ‌ట్టోడే!!

By:  Tupaki Desk   |   2 July 2020 6:15 AM GMT
11ఏళ్లు చిన్నోడే కానీ క‌న్న‌య్య ఆ ప‌నిలో మ‌హా గ‌ట్టోడే!!
X
క‌న్న‌య్య మ‌హా గ‌ట్టోడు. త‌న‌ కంటే పెద్ద వ‌య‌సు భామ‌ల‌తో శృంగారం లో చెల‌రేగి పోతాడంతే. బుట్ట‌ లో వేయ‌డం లో.. డేటింగుల పేరు తో రోమాంచితమైన లైఫ్ స్టైల్ ని ఎంజాయ్ చేయ‌డం లో ఈ కుర్ర హీరో త‌ర్వాత‌నే. అందుకే అత‌డిని క‌న్నా అంటూ ముద్దుగా పిలుచుకుంటూ 40 ప్ల‌స్ ఏజ్ మ‌లైకా అరోరాఖాన్ ఎంతో ఇది అయిపోతుంటుంది. నేను లేని నీవు లేవు! అన్న తీరుగా మ‌లైకా- అర్జున్ జంట స‌ల్లాపం నిరంత‌రం హాట్ టాపిక్.

ఇదంతా స‌రే కానీ అదెప్పుడు? అని ప్ర‌శ్నిస్తే.. పెళ్లి మాట దేవుడెరుగు.. ఇప్పుడిలా సంతోషం గా ఉన్నాం క‌దా! ఇలా అయినా బ‌త‌క‌నివ్వండి!! అంటూ ఆ ఇద్ద‌రి తీరే వేరుగా ఉంది. ప‌దే ప‌దే మీడియా అదే ప్ర‌శ్న అడిగితే సుతిమెత్త‌గా మొత్తేయ‌డంలోనూ క‌న్న‌య్య త‌ర్వాత‌నే. అదంతా స‌రే కానీ.. అర్జున్ క‌పూర్ గురించి మ‌లైకా ఇచ్చిన తాజా కాంప్లిమెంట్ వింటే షాక్ తిని గిల‌గిలా కొట్టుకుంటారంతే! ఇంత‌కీ ఏమ‌ని అంది? అంటే..

క‌న్న‌య్య నాకంటే 11 ఏళ్లు చిన్నోడే కానీ ఆ ప‌నిలో మ‌హా గ‌ట్టోడే! అంటూ కితాబిచ్చేసింది. ఇంత‌కీ ఏదా ప‌ని? అంటారా? అదేనండీ.. డేటింగ్. ఏకంగా బాలీవుడ్ నే త‌న క‌బంధ హ‌స్తాల్లో బంధించిన స్టార్ హీరో ఫ్యామిలీ నుంచి ఆవిడ‌ను స‌ప‌రేట్ చేశాడు! అన్న కామెంట్లు రెగ్యుల‌ర్ గానే వినిపిస్తున్నా.. అదేదీ క‌న్న‌య్య‌ను భ‌య‌పెట్ట‌లేదు. స‌రికదా.. ఏం జ‌రిగితే అదే జ‌రుగుతుంది! అన్న‌ట్టే ఉంటుంది అత‌డి వాల‌కం.

ఇక‌పోతే ఇంత‌కుముందు సాక్షాత్తూ సాటి హీరో ర‌ణ‌వీర్ సింగ్ ప‌క్క‌న ఉండ‌గానే ఆయ‌న ముందే అత‌డి భార్యామ‌ణి దీపిక ప‌దుకొనేని బుగ్గ‌పై ముద్దాడి నాకేం భ‌యం అన్న‌ట్టే చూశాడు. ఆ సీన్ లోనూ అత‌డి తెగువ గుండె ఝ‌‌ల్లుమ‌నిపించింది చూసేవాళ్ల‌కు. ఇక సోష‌ల్ మీడియాల్లో అయితే గురుడు ఓ రేంజులోనే చెల‌రేగుతుంటాడు. ఆ స్టార్ హీరోకి మాజీ ప్రేయ‌సి అన్న భ‌యమే లేకుండా ఇప్ప‌టికీ క‌త్రిన కైఫ్ తో క‌పూర్ బోయ్ స‌ర‌సం అగ్గి రాజేస్తూనే ఉంటుంది. ప్రియాంక చోప్రా.. ప‌రిణీతి చోప్రా స‌హా ప‌లువురు క‌థానాయికల‌కు హీట్ పుట్టించే మెసేజ్ లు పాస్ చేస్తూ క‌పూర్ బోయ్ ఆడే గేమ్ మామూలుగా ఉండ‌దు. అత‌డు మ‌హా చిలిపి క‌న్న‌య్య! అని అత‌డి యాక్టివిటీనే చెబుతుంటుంది. మ‌రి దీనిపై ఎవ‌రేం గుస‌గుస‌లాడుకున్నా క‌న్న‌య్య‌కు మాత్రం అస్స‌లు ప‌ట్ట‌నే ప‌ట్ట‌దు సుమీ!!