ఫోటోటాక్ : ఎండుటాకులు చుట్టావా అమ్మడు.. ఔనా భలే ఉంది

Sat Oct 01 2022 20:51:51 GMT+0530 (India Standard Time)

Malaika Arora latest pic

సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్స్ నుండి సామాన్య సెలబ్రెటీల వరకు ఫోటో షూట్స్ ను రెగ్యులర్ గా షేర్ చేస్తూనే ఉంటారు. అయితే కొన్ని ఫోటోలు మాత్రం జనాల యొక్క దృష్టిని ఆకర్షించే విధంగా ఉంటున్నాయి. అలా విభిన్నంగా ఉండేందుకు కొందరు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.స్కిన్ షో చాలా కామన్ అయ్యింది.. ఎంతగా అందాలు ఆరబోసినా కూడా ఈ మధ్య కాలంలో జనాలు చూస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. దాంతో విభిన్నమైన డ్రెస్ ల్లో హీరోయిన్స్ సోషల్ మీడియా సెలబ్రెటీలు నెటిజన్స్ ముందుకు వస్తున్నారు. అలా వచ్చిన సమయంలో కొందరు విమర్శలు ఎదుర్కొంటే కొందరు మాత్రం భలే ఉందే అనే టాక్ ని దక్కించుకుంటున్నారు.

తాజాగా మలైకా అరోరా కి చెందిన ఈ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. ఇందులో మలైకా అరోరా యొక్క కాస్ట్యూమ్స్ ను చూస్తుంటే ఎండుటాకులను డ్రెస్ గా చుట్టుకున్నట్లుగా ఉంది అంటూ కొందరు సరదాగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అందమైన మలైకా అరోరా ఇలా ఎండి పోయిన డ్రెస్ వేసుకుందేంటి.. కాస్త నీళ్లు చల్లితే ఆకులు ఆకు పచ్చ రంగుకు వస్తాయేమో అంటూ మీమ్స్ చేస్తున్నారు.

కొందరు మాత్రం ఈ డ్రెస్ లో మలైకా మరీ చెత్తగా అయితే లేదు.. విభిన్నంగా ఉంది.. భలేగా ఉంది అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మలైకా యొక్క అందాల ఆరబోత ఫోటోలు రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉంటాయి. ఈసారి కూడా అంతకు మించి అన్నట్లుగా ఈ పోటోలు వైరల్ అవుతున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.