బాడీ హగ్గింగ్ ఫ్రాక్ లో గుబులు రేపిన మలైకా

Wed Sep 28 2022 08:00:02 GMT+0530 (India Standard Time)

Malaika Arora latest pic

40 ఏజ్ డోంట్ కేర్.. 50 ఏజ్ నథింగ్ మ్యాటర్!! ఏజ్ తో పనే లేని నిత్యయవ్వనురాలిగా మలైకా అరోరాఖాన్ పాపులారిటీనే వేరు. 36 ఏజ్ కుర్ర హీరోతో రొమాంటిక్ లైఫ్ ని సెలబ్రేట్ చేస్తున్న ఈ డ్యాన్సింగ్ క్వీన్ ఇప్పటికీ బాలీవుడ్ లో ట్రెండీ టాపిక్. స్టైల్ కంటెంట్ లోనూ మలైకా రేంజే వేరని నిరూపణ అయ్యింది.ఆల్ టైమ్ హాటెస్ట్ ఫోటోషూట్లతో అంతర్జాలంలో దుమారం రేపడం మలైకా స్టైల్. తాజాగా ఈ బ్యూటీ మరో హాటెస్ట్ అవతారం  దుమారం రేపుతోంది. థై స్లిట్ ఫ్రాక్ లో మలైకా షోస్టాపర్ గా నిలిచింది. 50 వయసుతో పని లేకుండా టైట్ హగ్ స్టైల్ లో డిజైనర్ డ్రెస్ కి థై స్లిట్ ఎలివేషన్ అదనంగా క్రాక్ పుట్టించిందని చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మలైకా ప్రస్తుత ఏజ్ 48. హాఫ్ సెంచరీకి చేరువైంది. అయినా తనకు ఏజ్ ఒక మ్యాటర్ కానే కాదు. నేటితరం టాప్ మోడల్స్ యువనాయికలకు అందుకే మలైకా ఒక స్ఫూర్తి.

తనకంటే చాలా చిన్న వయసు చాక్లెట్ బోయ్ అర్జున్ కపూర్ తో మలైకా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు ప్రతిసారీ మీడియాలో పెళ్లెప్పుడు ?  అనే ప్రశ్న ఎదురవుతోంది. కానీ  సమాధానం నిల్. ఇలా సంతోషంగా ఉన్నాం అది చాలు! అని చెబుతున్నారు.

కానీ ఏదో ఒక రోజు ఆ ఘడియ సమీపించడం ఖాయమంటూ బాలీవుడ్ మీడియా భజంత్రీ గురించి తెలిసినదే. మలైకా ఇటీవల ఫ్యాషన్ ఈవెంట్లు -బుల్లితెర కార్యక్రమాలతో అసాధారణంగా ఆర్జిస్తోంది. యోగా గురువుగానూ యూట్యూబ్ లో భారీ ఆదాయ ఆర్జనను కలిగి ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.