మలైకా బ్యాక్ పై ఫ్లాష్ ల మెరుపులే మెరుపులు!

Thu Sep 23 2021 21:00:01 GMT+0530 (IST)

Malaika Arora latest Video Goes Viral

నటి.. మోడల్ కం ఫిట్ నెస్ ఔత్సాహికురాలు మలైకా అరోరా తనదైన అందం వయ్యారంతో కుర్రాళ్ల కంటికి కునుకుపట్టనివ్వని ట్రీటివ్వడంలో ఎక్స్ పర్ట్ అంటే అతిశయోక్తి కాదు. మైండ్ బ్లోవింగ్ అనిపించే ఫ్యాషన్ ఎంపికలు .. గుండె గుభేల్ మనిపించే గ్లామరస్ లుక్స్ తో మతులు చెడగొట్టడం మలైకా హాబీ.మలైకా జిమ్ కి వెళ్లినా యోగా సెషన్స్ కి వెళ్లినా లేదా పబ్లిక్ రోడ్ పై జాగింగ్ కి వెళ్లినా అక్కడ కెమెరా కళ్లు కాపు కాసుకుని కూచుంటాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అదే తీరుగా యోగా క్లాస్ నుంచి వెళుతున్న మలైకా వెంటే పడ్డాయి కొన్ని కెమెరా కళ్లు. ఇంకేం ఉంది వీక్షించిన వాళ్లకు వీక్షించినంతా వినోదం. మలైకా బ్యాక్ పై ఫ్లాష్ ల మెరుపులే మెరుపులు! ఇదిగో ఇలా బాతు నడకలతో మరోసారి నెటిజనుల్లో హాట్ టాపిక్ గా మారింది మలైకా. యోగా సెషన్స్ కి అలా బ్లాక్ ట్రాక్ లో ఎటెండయిన మలైకం ఉన్నట్టుండి ఇలా స్పెషల్ ట్రీటిచ్చింది. అయితే కొందరు నెటిజనులు మలైకా ఫీట్ ని ప్రశంసిస్తుంటే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ఆమె బ్యాక్ తో ఆహ్లాదం పంచేందుకు ఇలా బాతులా నడిచింది! అంటూ ఒక అభిమాని ప్రశంసించారు.

ఇటీవల తన సోదరి అమృతతో కలిసి డ్యాన్సులు చేస్తున్న వీడియోని మలైకా షేర్ చేయగా వైరల్ అయ్యింది. అంతేకాదు.. తనకు ఓ ఆడపిల్ల కావాలని తన కోరికను వెల్లడించిన వీడియో వైరల్ అయ్యింది.``నా ప్రియమైన అమృత చాలా మంది పిల్లలను దత్తత తీసుకున్నారు . పిల్లలు వారి జీవితాలకు ఎంతో ఆనందాన్ని తెచ్చిపెట్టడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. నేను నా కొడుకు అర్హాన్ తో చాలా విషయాలు చర్చించాను. మనం ఏదో ఒక రోజు బిడ్డను ఎలా దత్తత తీసుకోవాలి`` అనేది ముచ్చటించాను అని మలైకా అన్నారు.

కుమార్తె కావాలి..!

``నేను నా కుమారుడు అర్హాన్ ను చంద్రుని మించి ప్రేమిస్తున్నాను. కానీ నాకు ఒక కుమార్తె కూడా ఉండాలని కోరుకుంటున్నాను. అది నా హృదయంలో రన్నింగ్ సెంటిమెంట్. నాకు ఒక అమ్మాయి తోబుట్టువు ఉంది. మేము అన్నింటినీ పంచుకుంటాము. ఒకరి వెనుక ఒకరు చూస్తాం అనే అర్థంలో మేము చాలా విలక్షణంగా ఉన్నాము .... నేను ఒక అమ్మాయిని కలిగి ఉండాలని.. ఆ వెర్రి పనులన్నీ చేయాలనుకుంటున్నాను`` అంటూ మలైకా ఓ చాట్ సెషన్ లో కోరికను వెల్లడించారు.