కరోనాను జయించిన ఐటెం బాంబ్ రియాక్షన్

Mon Sep 21 2020 17:40:12 GMT+0530 (IST)

pandemic conquered item bombreaction?

బాలీవుడ్ పలువురు ప్రముఖులు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయిన విషయం తెల్సిందే. ఇప్పటికే పలువురు కరోనాను జయించారు. బచ్చన్ ఫ్యామిలీ మొత్తం కరోనాను జయించారు. ఆ తర్వాత పలువురు కూడా కరోనా నుండి బయట పడ్డారు. ఈనెల 7వ తారీకున కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యిందంటూ ప్రకటించిన ఐటెం బాంబ్ మలైకా అరోరా ప్రకటించింది. అప్పటి నుండి పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యినట్లుగా చెప్పింది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన ఫీలింగ్స్ ను షేర్ చేస్తూ వచ్చిన ఈ అమ్మడు తాజాగా తనకు నెగటివ్ వచ్చిందనే విషయాన్ని తెలియజేసింది.ఈ సందర్బంగా సోషల్ మీడియాలో మలైకా సుదీర్ఘ పోస్ట్ ను పోస్ట్ చేసింది. ఎట్టకేలకు రూం లో నుండి బయటకు వచ్చాను. దాని నుండి బయటకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆ సమయంలో నాకు అండగా నిలిచిన వైధ్యులకు బీఎంసీ వారికి మరియు నా సన్నిహితులకు కృతజ్ఞతలు. నా తోటి వారు ఆ సమయంలో చాలా ధైర్యంగా నిలిచారు. వారందరికి కూడా మాటలతో కృతజ్ఞతలు చెప్పలేను అంటూ మలైకా ఎమోషనల్ అయ్యింది. మీరు అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ మలైకా పేర్కొంది.