యంగ్ హీరో గర్ల్ ఫ్రెండ్ షేపవుట్ అవ్వకుండా ఈ శ్రమ!

Thu Mar 04 2021 20:00:01 GMT+0530 (IST)

Malaika Arora Latest Stunning Pose In Gym Dress

పర్ఫెక్ట్ ఫిట్ లుక్ కావాలంటే దానికోసం ఎంతగానో శ్రమించాల్సి ఉంటుంది. ఏజ్ 50కి సమీపిస్తుంటే జాగ్రత్త ఇంకా అవసరం. కానీ తనకు వయసుతో సమస్యేమీ లేదని నిరూపిస్తున్నారు మలైకా అరోరా. 47 ఏళ్ల ఈ మమ్మీ గారు ఇప్పటికీ పర్ఫెక్ట్ ఫిట్ లుక్ తో ఔరా! అనిపించేయడం యువతరంలో ప్రముఖంగా చర్చకు వస్తోంది. అసలింతకీ ఎందుకీ కఠిన శ్రమ. యంగ్ హీరోతో ప్రేమాయణం వల్లనేనా.. షేపవుల్ అవ్వకూడదనే ప్రయత్నమా?గత కొంతకాలంగా మలైకా అరోరా పబ్లిక్ అప్పియరెన్స్ గురించి యోగా జిమ్ సెషన్స్ గురించి యూత్ ఎక్కువగా పరిశీలిస్తున్నారు. ఆ హార్డ్ వర్క్ పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంత పర్ఫెక్ట్ ఫిట్ లుక్ మెయింటెయిన్ చేయడం ఇంకెవరికీ సాధ్యం కాదన్నది అందరి అభిప్రాయం. పర్ఫెక్ట్ యాబ్స్ టోన్డ్ బాడీ.. కొలతలకు తగ్గ అందంతో మలైకా ఇప్పటికీ కుర్రకారు కంటికి  కునుకు పట్టనివ్వడం లేదు. ఇక అర్జున్ కపూర్ తో ప్రేమాయణం నిరంతరం చర్చకు వస్తూనే ఉంది. అతడి కోసమే మలైకా ఇంతగా కాయకష్టం చేస్తోందన్నది సోషల్ మీడియాల్లో అందరి వాదనా.

మరో కోణంలో చూస్తే.. ఎప్పుడూ ఏదో ఒకటి చేసి అటెన్షన్ తనవైపు తిప్పుకోవడమెలానో మలైకాకు తెలిసినంతగా వేరొకరికి తెలీదేమో. ఇదిగో తాజాగా జాగింగ్ కి వెళుతూ కెమెరా కంటికి చిక్కారిలా. డ్యాన్స్ రియాలిటీ షోల హోస్ట్ గా జడ్జీగా.. అలాగే కమర్షియల్ ప్రకటనల డీల్స్ తో మలైకా బాగానే ఆర్జిస్తున్నారు. త్వరలోనే తనయుడిని బాలీవుడ్ లో హీరోని చేయాలన్న ప్రణాళికలతో ఉన్నారని సమాచారం.