Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మ‌లైకా ఏంది ఇంత కసి?

By:  Tupaki Desk   |   28 Jan 2022 4:01 PM GMT
ఫోటో స్టోరి: మ‌లైకా ఏంది ఇంత కసి?
X
జీవితంలో కొంద‌రికే ఇది సాధ్యం.జీవితాన్ని ఆస్వాధించ‌డంలో జీవన‌ గ‌మ‌నాన్ని అనునిత్యం కొత్త‌గా విల‌క్ష‌ణంగా నిర్ధేశించుకోవ‌డంలో.. అనుకున్న‌ది సాధించుకోవ‌డంలో ప్ర‌తి దాంట్లో క‌సి క‌నిపిస్తుంది. ఇక బాలీవుడ్ ఫ్యాష‌నిస్టా మ‌లైకా అరోరా ప‌ట్టుద‌ల క‌సి చూస్తే ఔరా! అంటూ ముక్కున వేలేసుకోవాల్సిందే. దాదాపు 50 సంవ‌త్స‌రాల వ‌య‌సులో ఇప్ప‌టికీ త‌న ఆదాయ ఆర్జ‌న ఏమాత్రం త‌గ్గ‌కుండా ఫాలోయింగ్ త‌గ్గ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌డంలో ఈ అమ్మ‌డు ఎంత కేర్ ఫుల్ గా ఉంటుందో చెప్పాల్సిన ప‌నే లేదు.

ముఖ్యంగా ఫిట్నెస్ ఫ్రీక్ గా త‌న గ్లామ్ కంటెంట్ ని ఎంత‌మాత్రం త‌గ్గ‌నివ్వ‌దు. స్టైల్ ఐక‌న్ గా ఫ్యాష‌నిస్టాగా త‌న‌లోని మేని విరుపులు ఏమాత్రం త‌గ్గ‌వు. అంత‌గా ఫిజిక‌ల్ ఫిట్నెస్ ని మెయింటెయిన్ చేస్తుంది. పాప్ స్టార్ .. ర్యాప్ స్టార్ .. సాల్సా క్వీన్ .. ఎవ‌రైనా మ‌లైకాకు వొంగి వొంగి స‌లాం కొట్టాల్సిందే. డ్యాన్సుల్లో లుక్ లో ఎక్క‌డా త‌గ్గ‌దు. ఇక ప్రియుడితో షికార్ల‌లోనూ మ‌లైకా అంద‌రిలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. లేట్ ఏజ్ లో యువ‌హీరో అర్జున్ క‌పూర్ తో చెట్టాప‌ట్టాల్ అంటూ షికార్ చేయ‌డం త‌న‌కే చెల్లింది. తాజాగా మ‌లైకా హాటెస్ట్ ఫోటోషూట్ ఒక‌టి అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోంది. ప్ర‌ఖ్యాత టిస్సాట్ బ్రాండ్ కి అంబాసిడ‌ర్ గా మ‌లైకా విలాపం ఈ ఫోటోగ్రాఫ్ లో ఒక్క‌సారిగా వేడెక్కించింది. పాక్షికంగా ఎద అందాల‌ను క‌వ‌ర్ చేస్తున్న ప్ర‌త్యేక వ‌స్త్రధార‌ణ‌లో మ‌లైకం మ‌త్తెక్కించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ యువ‌త‌రంలో వైర‌ల్ గా మారింది. మ‌లైకా ఏంది ఇంత క‌సి? అంటూ యూత్ త‌నని ప్ర‌శ్నిస్తున్నారు.

బ్రేక‌ప్ ప్ర‌చారంలో నిజం లేదు!

మలైకా అరోరా - అర్జున్ కపూర్ విడిపోతున్నార‌ని ఇటీవ‌ల ప్ర‌చార‌మైంది. కానీ అది నిజం కాద‌ని ఆ ఇద్ద‌రూ ఇంత‌కుముందు ఖండించారు. అవ‌న్నీ త‌ప్పుడు క‌థ‌నాలు అంటూ వెంటనే కొట్టిపారేశారు. అర్జున్ తన లేడీ లవ్ తో మోనోక్రోమ్ ఫోటోను పంచుకున్నాడు. ప్రేమపక్షులు మిర్రర్ సెల్ఫీకి పోజులివ్వడంతో ఉబెర్ కూల్ గా కనిపించారు. ``అసలు పుకార్లకు చోటే లేదు`` అని అర్జున్ అన్నాడు. అంతేకాదు.. ``సురక్షితంగా ఉండండి. ఆశీర్వాదంతో ఉండండి. ప్రజలకు శుభాకాంక్షలు. అందరినీ ప్రేమించండి`` అని కూడా సూచించాడు.

అతను పోస్ట్ ను షేర్ చేసిన వెంటనే స్నేహితురాలు మలైకా వ్యాఖ్యల విభాగంలో హార్ట్ ఎమోజీల్ని షేర్ చేసింది. అయితే మ‌లైకా .. అర్జున్ మ‌ధ్య ఎందుకు అంత గ్యాప్ వ‌చ్చింది అంటే.. అర్జున్ సోదరి అన్షులా కపూర్‌తో పాటు రియా కపూర్ .. కరణ్ బూలానీలకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. దీంతో వారు దూరం ఉండాల్సొచ్చింది. దీంతో వీరిద్ద‌రి విడిపోయార‌న్న పుకార్లు వైర‌ల‌య్యాయి.