Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : 5 పదుల వయసుకు చేరువైన అదే ఫిజిక్‌

By:  Tupaki Desk   |   11 Sep 2021 4:30 AM GMT
ఫొటోటాక్‌ :  5 పదుల వయసుకు చేరువైన అదే ఫిజిక్‌
X
బాలీవుడ్ తో పాటు దేశ వ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులకు సుపరిచితురాలు మలైకా అరోరా. ఈమె అర్బాజ్‌ ఖాన్ తో విడిపోయిన తర్వాత యంగ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ తో సహజీవనం సాగిస్తుంది అనేది అందరికి తెలిసిన విషయం. వీరిద్దరు పెళ్లి చేసుకుంటారు అనే విషయమై జోరుగా వార్తలు వచ్చాయి. కాని పరిస్థితి చూస్తుంటే వారు పెళ్లిపై ఆసక్తి ఉన్నట్లుగా కనిపించడం లేదు. వయసు పెరుగుతున్నా కూడా మలైకా అరోరా మాత్రం ఇంకా బుల్లి తెర వెండి తెర ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తాజాగా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు యంగ్‌ హీరోయిన్స్ కూడా కుల్లుకునేలా ఉన్నాయి.

పాతికేళ్ల అమ్మాయిలు కూడా అరే ఇంత అందంగా మేము ఎందుకు ఉండటం లేదు అనుకునేలా ఈమె లుక్ ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. దాదాపుగా అయిదు పదుల వయసుకు చేరువ అయిన మలైక ఇప్పటికి కూడా వర్కౌట్స్ విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. మలైక ఫిజిక్ ను చూసి ఎంతో మంది ఆదర్శంగా తీసుకుంటారు అనడంలో సందేహం లేదు. ఈ వయసులో తనకు ఒక బిడ్డ కావాలని ఉంది అంటూ వ్యాఖ్యలు చేసిన మలైకా అందుకోసం ప్రయత్నించేందుకు ఇలా ఫిజిక్ ను మెయింటెన్‌ చేస్తుందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా స్పోర్ట్స్ బ్రా మరియు బ్లాక్‌ పాయింట్‌ లో వర్కౌట్ చేసి అలాగే అలసిపోయి వచ్చేసినట్లుగా ఈ ఫొటోలో కనిపిస్తుంది. తన కొడుకును మిస్ అవుతున్నట్లుగా మెసేజ్‌ పెట్టింది. విడాకులు తీసుకున్న తర్వాత కొడుకును తనతోనే పెంచుకుంటున్న మలైక చదువుకోసం దూరంగా ఉంచుతున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ లో ఈమెను ఇంకా వెండి తెరపై చూపించేందుకు గాను మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈమె కూడా హీరోయిన్‌ గా కాకున్నా క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు అనే టాక్‌. బుల్లి తెరపై కూడా ఈమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.