మాల్దీవులకు మలైకా మెంటలెక్కే ట్రీట్

Sat Dec 04 2021 12:00:32 GMT+0530 (IST)

Malaika Arora Flaunts her Beauty in Maldives

వరుసగా బాలీవుడ్ యువకథానాయికలు మాల్దీవులకు మతిచెడే ట్రీటిచ్చిన సంగతి తెలిసిందే. సారా అలీఖాన్ - జాన్వీ కపూర్ - అనన్య పాండే లాంటి అందగత్తెలు బికినీ లతో అదరగొట్టారు.కొద్ది రోజుల క్రితం బుట్టబొమ్మ పూజా హెగ్డే అన్ లిమిటెడ్ ట్రీట్ ని ఇంకా అభిమానులు మర్చిపోలేదు. ప్రస్తుతం మాల్దీవులకు ఇల్లీ వైరస్ సోకింది. ఇలియానా బీచ్ బికినీ ట్రీట్ మెంటలెక్కిస్తోంది.

ఇంతలోనే మాల్దీవులకు మంటలు పెడుతూ ప్రత్యక్షమైంది మలైకా అరోరా. అలా బీచ్ రిసార్ట్ లో వాలిపోయిన ఈ బ్యూటీ ఒంటిపై నూలిపోగను అయినా నిలవనీయక టూపీస్ లో ప్రత్యక్షమైంది. రిసార్ట్ పరిసరాల్లో దుమారం రేపుతోంది.

మలైకా తన బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ తో కలిసి హాలిడే ట్రిప్ ని ఎంజాయ్ చేస్తోంది. తాజాగా బీచ్ వెకేషన్ నుండి కొన్ని చిత్రాలను అభిమానులకోసం ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. మాల్దీవుల ఫారీ ఐలాండ్ లోని ప్రైవేట్ యాచ్ లో అందమైన సముద్రాన్ని ఆస్వాధిస్తూ బికినీ ట్రీటిచ్చింది.

ఒంపుల ఖిల్లా లాంటి అందాల శిరుల్ని ఆరబోసింది మలైకం. తనతో పాటు అర్జున్ కూడా ఒంటరి దీవిలో టై అప్ అయ్యాడనేందుకు ఆధారం లభించింది. బీచ్ ఒడ్డున సగం ఖాళీ చేసిన కాక్టెయిల్ డ్రింక్ కనిపిస్తోంది.

తనతో పాటే సిప్ చేస్తున్న ప్రియుడిని మాత్రం దాచేసింది మలైకా. తన అందమైన పాదాల చిత్రాన్ని తీసింది మాత్రం అర్జున్.. వెకేషన్ ని ఈ జంట మస్త్ మజాగా ఎంజాయ్ చేస్తోందని అర్థమవుతోంది.