Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : కెవ్వు కేక అనిపించేంత అందం

By:  Tupaki Desk   |   31 July 2021 3:30 PM GMT
ఫొటోటాక్‌ : కెవ్వు కేక అనిపించేంత అందం
X
బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ ఐటెం సాంగ్‌ లకు కేరాఫ్‌ అడ్రస్ అయిన మలైక అరోరా అయిదు పదుల వయసుకు చేరువ అయ్యింది. అతి త్వరలోనే ఆమె హాఫ్‌ సెంచరీ చేరుకోబోతుంది. అయినా కూడా ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు అన్నట్లుగా అనిపిస్తుంది. ఇరవై ఏళ్ల క్రితం ఆమె దిల్ సే లో ఆమె ఎలా కనిపించిందో ఇప్పుడు కూడా అలాగే కనిపిస్తుంది అంటూ అంతా కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆమె షేర్‌ చేసిన ఈ ఫొటోను చూస్తూ ఆ విషయాన్ని ఒప్పుకోని వారు కూడా ఈసారి ఒప్పుకుని తీరుతారు.

మలైక అరోరా పిల్లలకు తల్లి అయినా కూడా ఏమాత్రం అందం తగ్గలేదు. రెగ్యులర్‌ గా ఫొటో షూట్‌ లతో అభిమానుల గుండెల్లో గుబులు పుట్టిస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి ఈమె వావ్‌ అనిపించేంత అందంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ ఫొటోలో ఆమె ఔట్‌ ఫిట్‌ మాత్రమే కాకుండా ఆమె ఒంపు సొంపులు మరియు ఆమె ఫిజిక్ విషయంలో పాతికేళ్ల వయసు ఉన్న హీరోయిన్స్ కూడా ఆదర్శంగా తీసుకోవాలి అన్నంతగా ఉంది.

గత కొన్నాళ్లుగా సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపించని మలైక అరోరా ఈమద్య కాలంలో మాత్రం అందరిని ఆకట్టుకునేలా సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా పోస్ట్‌ లు పెడుతోంది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఉన్న కారణంగా ఈమెకు ఇప్పటికి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఇలాంటి హాట్ ఫొటోలను షేర్‌ చేస్తే కొత్తగా కూడా చాలా మంది అభిమానులు అయ్యే అవకాశాలు లేకపోలేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.