డీజే టిల్లు... కొత్త 'రాధిక' ఎవరో తెలుసా..?

Sat Aug 13 2022 20:00:01 GMT+0530 (IST)

Anupama Parameswaran In Dj Tillu Sequel

అట్లుంటది మనతోని.. ఏం టిల్లు.. నీకు నన్ను నమ్మడానికి ఏం ప్రాబ్లం.. ఇది నిజంగానే నన్నడుగుతున్నవా రాధిక.. వంటి డైలాగ్స్ లో యూత్ లో ఫుల్ మాస్ క్రేజ్ సంపాదించిన సినిమా డీజే టిల్లు. టిల్లు గా సిద్ధు జొన్నలగడ్డ.. రాధికగా నేహా శెట్టి చేసిన సందడి అంతా ఇంతా కాదు. అటు యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ని కూడా ఎంటర్టైన్ చేసిన సినిమా ఇది. అందుకే మేకర్స్ సీక్వెల్ ని మొదలు పెట్టారు. అయితే సీక్వెల్ లో మాత్రం కొన్ని మార్పులు చేస్తున్నారట. మరి ఎవరు ఎవరు మారారు ఓ లుక్కేయండి.డీజే టిల్లు సినిమాతో సిద్ధూ జొన్నలగడ్డ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కామెడీ సస్పెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాగా  'డీజే టిల్లు ' హిట్ సాధించింది. విమల్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అయితే సీక్వెల్ ను మాత్రం ఈ దర్శకుడు తీయడం లేదట. డీజే టిల్లు సీక్వెల్ ను మల్లిక్ రామ్ అనే డైరెక్టర్ తీస్తున్నాడట.

ఈ విషయాన్ని డీజే టిల్లు అదేనండి సిద్దు జొన్నలగడ్డ చెప్పారు. ఈ సినిమాలో హీరో తో పోటీగా అంతే ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్ హీరోయిన్ ది. రాధిక గా నేహా శెట్టి అదరగొట్టింది. సిద్ధూకి ఏ మాత్రం తీసిపోకుండా..ఇరగదీసింది.

అయితే సీక్వెల్ లో మాత్రం నేహా శెట్టి ఉండటం లేదట. ఇది ఫ్యాన్స్ కి కాస్త నిరాశపరిచే న్యూస్ అయినా.. ఆ పాత్రలో వస్తోందెవరో తెలిస్తే ఎగిరి గంతేస్తారు. ఆమె ఎవరో కాదు తన మొదటి సినిమా నుంచి ప్రతి సినిమా తో యువకులు గుండెలు కొల్లగొడుతున్న అనుపమ పరమేశ్వరన్.  ఇది క్రేజీ న్యూస్ కదా. మరి రాధిక గా అనుపమ ఎలా అలరిస్తుందో చూడాలంటే డీజే టిల్లు సీక్వెల్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

డీజే టిల్లు సినిమాకు సీక్వెల్‌గా  'డీజే టిల్లు 2 ' చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట. ఫైనల్ స్కిప్ట్ వర్క్‌లో సిద్ధు బిజీగా ఉన్నారు. త్వరలో  'డీజే టిల్లు 2 ' సినిమాను తెరకెక్కించనున్నారు. సిద్ధు కొత్త చిత్రాన్ని  'సితార ఎంటర్ టైన్ మెంట్స్ ' నిర్మిస్తుంది. ఈ చిత్రంలో సిద్ధు గెటప్ యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉంటుందంటున్నారు అభిమానులు. కొత్త నటీనటులతో సరికొత్త కథతో సిద్ధు ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

డీజే టిల్లు సినిమా సీక్వెల్‌గా మరో సినిమా తీయాలనుకుంటున్నామని సిద్ధూ జొన్నలగడ్డ చెప్పారు. డీజే టిల్లు క్యారెక్టర్‌కు లిమిట్స్ లేవని.. ఎలా అయినా ఆ పాత్రను తెరకెక్కించవచ్చన్నారు. టిల్లుపై ఎలాంటి కథలైనా అల్లుకోవచ్చన్నారు. ప్రస్తుతం  'డీజే టిల్లు' సీక్వెల్ సినిమాకు సంబంధించిన వర్క్ చేస్తున్నానని అన్నారు.